Page Loader
Mahua Moitra & Pinaki Misra: మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం
మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం

Mahua Moitra & Pinaki Misra: మరోసారి వార్తల్లోకి ఎంపీ మహువా మొయిత్రా.. జర్మనీలో రహస్యంగా వివాహం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లోక్‌సభ సభ్యురాలు మహువా మోయిత్రా మరోసారి వార్తల్లో హాట్‌టాపిక్ అయ్యారు. మే 3న ఆమె గోప్యంగా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.ఈవిషయాన్నిఇప్పటివరకు మహువా మొయిత్రా గానీ,ఆమె పార్టీ టీఎంసీ గానీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే మీడియా ఈ అంశంపై ఓ ప్రముఖ టీఎంసీ ఎంపీని ప్రశ్నించగా,తనకు వివాహానికి సంబంధించి ఎటువంటి సమాచారం తెలియదని ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో ప్రకారం మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ,ఒక వ్యక్తి పక్కన నిలబడి ఉన్నారు. ఈ వివాహ వేడుక జర్మనీలో జరిగినట్టు వార్తా సంస్థ 'ది టెలిగ్రాఫ్' వెల్లడించింది. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు పినాకి మిశ్రా.ఆయన బిజు జనతాదళ్ పార్టీకి చెందిన నాయకుడు.

వివరాలు 

2023 డిసెంబర్‌లో లోక్ సభ సభ్యత్వం రద్దు 

పూరీ లోక్‌సభ సభ్యుడిగా కూడా పనిచేశారు. మహువా మొయిత్రా గతంలో డెన్మార్క్‌కు చెందిన ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అనంతరం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.తర్వాత ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్‌తో సుమారు మూడేళ్ల పాటు ప్రేమ సంబంధం కొనసాగించారు. ఇక గతంలో మహువా మొయిత్రాపై ,బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభలో ప్రశ్నలు అడగడానికి ఆమె డబ్బులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వివాదంపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ విచారణ చేపట్టి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా స్పీకర్ మహువా మొయిత్రా సభ్యత్వాన్ని రద్దు చేస్తూ,సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు 2023 డిసెంబర్‌లో అధికారికంగా ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జర్మనీలో రహస్యంగా వివాహం