NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Yusuf Pathan: గుజరాత్‌లోని వడోదరలో 'భూ ఆక్రమణ' ఆరోపణలపై TMC ఎంపీకి నోటీసు 
    తదుపరి వార్తా కథనం
    Yusuf Pathan: గుజరాత్‌లోని వడోదరలో 'భూ ఆక్రమణ' ఆరోపణలపై TMC ఎంపీకి నోటీసు 
    గుజరాత్‌లోని వడోదరలో 'భూ ఆక్రమణ' ఆరోపణలపై TMC ఎంపీకి నోటీసు

    Yusuf Pathan: గుజరాత్‌లోని వడోదరలో 'భూ ఆక్రమణ' ఆరోపణలపై TMC ఎంపీకి నోటీసు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 14, 2024
    04:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీ యూసఫ్ పఠాన్ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

    భూమి ఆక్రమణకు సంబంధించి యూసుఫ్ పఠాన్‌కు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) నోటీసు పంపింది.

    ఈ భూమి కార్పొరేషన్‌కు చెందినదని, మాజీ క్రికెటర్ కబ్జా చేశారని విఎంసి చెబుతోంది.

    లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే జూన్ 6న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న కార్పొరేషన్ ఈ నోటీసును పంపింది. అయితే ఈ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

    వివరాలు 

    ఈ విషయాన్ని బీజేపీ మాజీ కౌన్సిలర్ లేవనెత్తారు 

    భారతీయ జనతా పార్టీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శీతల్ మిస్త్రీ గురువారం మీడియాతో దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి జరిగిన ఎన్నికల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు.

    అంతకుముందు, పవార్ విలేకరులతో మాట్లాడుతూ, 2012లో మాజీ క్రికెటర్‌కు ప్లాట్‌ను విక్రయించాలన్న VMC ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందని, అయితే ఇటీవల ఎంపీ అయిన పఠాన్ ప్లాట్‌లో గోడను నిర్మించారని ఆరోపించారు .

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు 

    యూసఫ్ పఠాన్‌పై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు. TP 22 కింద తాండల్జా ప్రాంతంలో VMC యాజమాన్యంలోని ఒక ప్లాట్ రెసిడెన్షియల్ ప్లాట్.

    2012 సంవత్సరంలో, పఠాన్ ఈ ప్లాట్‌ను VMC నుండి డిమాండ్ చేశాడు, ఎందుకంటే ఆ సమయంలో అతని ఇల్లు ఆ ప్లాట్‌కు ఆనుకుని నిర్మాణంలో ఉంది. "అతను ఈ ప్లాట్ కోసం చదరపు మీటరుకు సుమారు రూ. 57,000 కూడా ఆఫర్ చేశాడు."

    ఆ సమయంలో పఠాన్ ప్రతిపాదనకు VMC ఆమోదం తెలిపింది. ఇది జనరల్ బోర్డు సమావేశంలో కూడా ఆమోదించబడింది.

    అయితే, ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయం తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు.

    వివరాలు 

    ఆక్రమణకు సంబంధించి యూసఫ్ కి నోటీసు

    "ప్రతిపాదన తిరస్కరించబడినప్పటికీ, VMC ప్లాట్ చుట్టూ ఎలాంటి కంచెను ఏర్పాటు చేయలేదు. ఆ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి పఠాన్ ఆక్రమించాడని నాకు తర్వాత తెలిసింది. సమాచారం అందుకున్న తర్వాత, నేను మునిసిపల్ కార్పొరేషన్‌ను దర్యాప్తు చేయమని కోరాను"అని పవార్ అన్నారు.

    978 చదరపు మీటర్ల ప్లాట్‌ను యూసుఫ్ పఠాన్‌కు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని ఘటనలను కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శీతల్ మిస్త్రీ ధృవీకరించారు.

    ఆక్రమణకు సంబంధించి అతనికి నోటీసు అందజేసినట్లు చెప్పారు.

    వివరాలు 

    కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సమాచారం 

    ఆయన ఇంకా మాట్లాడుతూ, "ఇటీవల, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి మాకు కొంత సమాచారం అందింది. అందుకే జూన్ 6న పఠాన్‌కు నోటీసు పంపి ఆక్రమణలన్నీ తొలగించాలని కోరాం. మేము ఈ విషయంలో కొన్ని వారాల పాటు వేచి ఉండి, తదుపరి చర్యను నిర్ణయిస్తాము. ఈ భూమి VMCకి చెందినది, మేము దానిని తిరిగి పొందుతాము" అని అయన అన్నారు..

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025