Page Loader
Trinamool Congress Party : టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు 
మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు ఇచ్చిన దీదీ టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు

Trinamool Congress Party : టీఎంసీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 13, 2023
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మహువా మోయిత్రాకు కొత్త బాధ్యతలు అప్పగించింది. మహువా లోక్‌సభ నియోజకవర్గం కృష్ణానగర్‌ పరిధిలోని నదియా నార్త్‌ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. మెహువా ప్రస్తుతం కృష్ణానగర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలపై ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో మోయిత్రాకు పార్టీ అదనంగా బాధ్యతలు అప్పగించడం కొసమెరుపు. మరోవైపు తనను పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన మమతా బెనర్జీకి మహువా కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దీదీకి థ్యాంక్స్ చెప్పిన ఎంపీ మహువా మోయిత్రా