Page Loader
TS Governor : తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనిది: గవర్నర్ తమిళి సై
అందరికీ ధన్యవాదాలు

TS Governor : తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనిది: గవర్నర్ తమిళి సై

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jan 01, 2024
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్'భవన్'లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు రాజ్ భవన్'లో గవర్నర్ తమిళిసైకి సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు అధికారులు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పందించిన తమిళిసై, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 4గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉన్నానని, ఈ క్రమంలోనే దాదాపుగా 3500 మంది తనను కలిశారన్నారు. బొకేలు కాకుండా తన సూచన మేరకు బుక్స్, నోట్స్ వారందరికీ గవర్నర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రేమ ఆప్యాయత మరువలేనన్నారు.గవర్నర్ వాట్సప్ ఛానెల్ లాంఛ్ అయ్యిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్‌భవన్‌లో గవర్నర్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి