ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. టిక్కెట్ ధరలపై భారీగా డిస్కౌంట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. ఈ మేరకు టిక్కెట్ ధరపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ నంబర్లు 040-694400, 040-23450033లను సంప్రదించాలని కోరింది.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టిక్కెట్ ధరలపై 50 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సిటీ బస్సులతో పాటు పల్లె వెలుగులకూ ఈ రాయితీలు వర్తిస్తాయన్నారు.
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు 50 శాతం రాయితీ అమలు కానుంది.వయసు ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డును చూపించాలని కోరారు.
హైదరాబాద్ లో 24 గంటల అన్ లిమిటెడ్ ప్రయాణానికి టి-24 టిక్కెట్ ను రూ.75కే ఇస్తున్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు.పిల్లలకు టీ-24 టిక్కెట్ ధరను రూ.50గా నిర్ణయించామన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆగస్ట్ 15న ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను #TSRTC ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 13, 2023
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…