LOADING...
UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!
యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!

UAE: యూఏఈలో ఇద్దరు కేరళ వాసుకు మరణశిక్ష అమలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూఏఈలో హత్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఈ సమాచారం బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. మరణశిక్షకు గురైన వారిని మహమ్మద్‌ రినాష్‌ అరింగిలొట్టు, మురళీధరన్‌ పెరుమ్తట్టు వలప్పిల్‌గా గుర్తించారు. ఈ ఇద్దరూ కేరళకు చెందినవారే. ఓ యూఏఈ పౌరుడి హత్య కేసులో మహమ్మద్‌ రినాష్‌ దోషిగా తేలాడు, అలాగే ఓ భారతీయుడి హత్యకు సంబంధించి మురళీధరన్‌కు శిక్ష విధించారు. వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సహాయం అందించామని విదేశాంగశాఖ వెల్లడించింది.

వివరాలు 

ఫిబ్రవరి 15వ తేదీన ఆమెకు ఉరిశిక్ష

యూఏఈ జైల్లో భారతీయ మహిళ షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేసిన విషయం కూడా ఇటీవలే వెలుగుచూసింది. ఓ హత్య కేసులో ఆమెకు ఈ శిక్ష విధించబడింది. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినప్పటికీ విజయవంతం కాలేదు. ఫిబ్రవరి 15వ తేదీన ఆమెకు ఉరిశిక్ష అమలు చేసినప్పటికీ, ఆ సమాచారం ఆలస్యంగా ఆమె కుటుంబానికి చేరింది.