Rahul Gandhi:రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. తప్పుబట్టిన కేంద్రమంత్రులు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు, దేశంతోనూ పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పలువురు కేంద్రమంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలైన స్వభావం బయటపడిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.
దేశంపై ప్రతిపక్షం పోరాడుతోందని చెబుతున్న రాహుల్, రాజ్యాంగం రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు దేశంతో పోరాడుతున్నామని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు.
వివరాలు
రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్ తో సంబంధం
దిల్లీలో కాంగ్రెస్ తన కొత్త ప్రధాన కార్యాలయాన్నిబుధవారం ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ,"ఆరెస్సెస్ వంటి మా భావజాలం వేల సంవత్సరాల నాటిది.బీజేపీ,ఆరెస్సెస్ దేశంలోని ప్రతీ సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి.మేము ఇప్పుడు బీజేపీ,ఆరెస్సెస్‌తోపాటు దేశం మీద కూడా పోరాడుతున్నాం"అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ,"ఇక దాపరికం లేదు,కాంగ్రెస్ అసలైన ముఖం బయటపడింది" అని తెలిపారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయన అభినందనలూ తెలిపారు "రాహుల్ గాంధీ, ఆయన చుట్టూ ఉన్నవారికి అర్బన్ నక్సల్స్ తో సంబంధం ఉందన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసింది. దేశాన్ని పరువు తీయాలనే ఉద్దేశంతో వారు పనిచేస్తున్నారు.వారే భారత్‌ను ముక్కలు చేసి, విభజించాలనుకున్నారు"అని నడ్డా ఎక్స్ వేదికగా మండిపడ్డారు.