
Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.
కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన స్లాబ్ కూలిపోవడంతో ఈ ఘటన జరిగింది.శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు.
జిల్లా అధికారి ఒకరు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై భగల్‌పూర్, ఖగారియా జిల్లాలను కలిపేలా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2014లో శంకుస్థాపన చేశారు. .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
VIDEO | Several workers are reportedly trapped as a part of an under-construction bridge over #Kosi River collapses in Bihar's #Supaul. Rescue work underway. More details are awaited.#BiharNews
— Press Trust of India (@PTI_News) March 22, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/iNU9SGLevQ