Union Budget 2023-24 (Live Updates): Income Tax rules and slabs

చైనాకు పోటీగా భారతదేశం ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఎదిగే ప్రయత్నంలో భాగంగా మొబైల్ ఫోన్ల తయారీకి సంబంధించిన కొన్ని ఇన్‌పుట్‌ల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. భారతదేశ మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2014-15లో 5.8 కోట్ల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 31 కోట్లకు చేరుకుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్నులకు సంబంధించి, అత్యధిక ఆదాయ సర్‌ఛార్జ్‌ను 37% నుండి 25%కి తగ్గింపు ప్రకటించిన నిర్మల సీతారామన్ . ఇది అత్యధిక రేటును 42.74% నుండి 39%కి తగ్గిస్తుంది.
కొత్త పన్ను రేట్లు ఇవే
రూ. 0-3 లక్షలు- పన్ను లేదు
రూ. 3-6 లక్షలు: 5%,
రూ. 6-9 లక్షలు: 10%,
రూ. 9-12 లక్షలు: 15%,
రూ. 12-15 లక్షలు: 20% ఆపైన రూ. 15 లక్షలు: 30%
లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచారు ప్రభుత్వ జీతాలు తక్కువగా ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో ఈ పరిమితిని నిర్ణయించారు.
ఉద్యోగుల కోసం సవరించిన స్లాబ్‌లను ప్రవేశపెట్టింది. బడ్జెట్ 2023 ప్రకటనలో భాగంగా, కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను రాయితీని పొడిగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులలో మూడు వర్గాలు ఉన్నాయి: 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, సీనియర్ సిటిజన్లు (60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), సూపర్ సీనియర్ సిటిజన్లు (80 కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు).
భారీగా తగ్గనున్న టివిలు,మొబైళ్ళు ,ఎలక్ట్రిక్ వాహనాల ధరలు, ముఖ్యంగా టివి ప్యానెళ్ల పై 2.5 శాతం కస్టమ్ డ్యూటీ తగ్గించిన ప్రభుత్వం. భారీగా పెరగనున్న బ్రాండెడ్ దుస్తులు, టైర్లు, సిగ్గరెట్ల ధరలు.
బడ్జెట్ లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) క్రెడిట్ గ్యారెంటీ ప్రకటించబడింది. పునరుద్ధరించిన పథకం ద్వారా ఏప్రిల్ 1 నుంచి రూ. 9,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, క్రెడిట్ ఖర్చు 1% తగ్గుతుంది.
పేర్కొన్న ప్రభుత్వ ఏజెన్సీల అన్ని డిజిటల్ సిస్టమ్‌లలో శాశ్వత ఖాతా సంఖ్య (PAN) సాధారణ ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించబడుతుంది.
2014లో ఆర్థిక సమ్మేళనం లక్ష్యంగా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 47.8 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరవడం జరిగిందని నిర్మల సీతారామన్ తెలిపారు.
పాత వాహనాల రీప్లేస్‌మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం అన్ని పాత ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌లను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ
స్టార్టప్‌లను ప్రోత్సహించి ఇన్నోవేషన్‌ను ఆవిష్కరించడానికి నేషనల్ డేటా గవర్నెన్స్ పాలసీ తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
అంతర్జాతీయ అవకాశాల కోసం యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వివిధ రాష్ట్రాలలో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం తన మూలధన వ్యయాన్ని 33% పెంచి 10 ట్రిలియన్ రూపాయలకు (122.29 బిలియన్ డాలర్లు) పెంచుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం రైల్వేలకు అందించిన మూలధన వ్యయం రూ. 2.4 లక్షల కోట్లు. 2013-14 తర్వాత ఆ శాఖకు ఇవే అత్యధిక కేటాయింపులు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై దృష్టి పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. AI కోసం మూడు కేంద్రాలు కేటాయిస్తున్నట్లు ఇవి భారతదేశం కోసం AI చేయడం కోసం, AI భారతదేశం కోసం పనిచేసే విధంగా చేయడానికి వీలు కల్పిస్తాయని సీతారామన్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు 50ఏళ్ల వడ్డీ లేని రుణాలను మరో ఏడాది పాటు కొనసాగించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
3.5లక్షల గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ప్రధానమంత్రి ఆదిమ బలహీన గిరిజన సమూహం పథకాన్ని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
భారతదేశం డిజిటల్ అభివృద్దిని ప్రపంచంలోనే సాటిలేనిదిగా నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. అమృత్ కాల్ కోసం ప్రభుత్వ దృష్టి టెక్నాలజీతో నడిచే విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థతో పాటు బలమైన పబ్లిక్ ఫైనాన్స్, బలమైన ఆర్థిక రంగంపై కూడా ఉందని ఆమె తెలిపారు.
నాణ్యమైన పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్లు వెల్లడించారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యత్వం ఏడు కోట్లకు రెట్టింపు కావడం భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్దిలో ముఖ్య పాత్ర పోషించిందని, EPFO సభ్యత్వం రెట్టింపు కావడం ఉపాధిని కూడా పెంచిందని ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. కొత్త ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జి20 అధ్యక్ష పదవి భారత్‌కు ఒక అపూర్వ అవకాశమని ఆమె అన్నారు.
బడ్జెట్ 2023లో వ్యసాయానికి పెద్దపీట వేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యవసాయ స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలను అందిస్తామని చెప్పారు. వ్యవసాయానికి రూ.20లక్షల కోట్లు రుణాలు అందిస్తామని పేర్కొన్నారు.
శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సాహిస్తామని వెల్లడించారు.
2023 బడ్జెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్ లాంటిదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను సాధించడమే తమ లక్ష్యమన్నారు. పీఎం-కిసాన్ కింద ప్రభుత్వం రూ. 2.2 లక్షల కోట్ల నగదు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2023-24ను పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఇది 'అమృత కాలం'లో ప్రవేశ పెడుతున్న తొలి బడ్జెట్‌గా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ కు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఆమోదం తెలిపిన తర్వాత కేంద్ర మంత్రీ నిర్మల సీతారామన్ లోకసభకు చేరుకున్నారు. ఇప్పటికే ప్రారంభమైన శాసనమండలి సమావేశంలో 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ పై పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోసం ఒక ప్రత్యేక యాప్ ను 2021లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) అధ్వర్యంలో ప్రభుత్వ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తయారుచేసింది. గూగుల్ ప్లే, ఆపిల్ స్టోర్ లో ఈ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ (www.Indiabudget.Gov.In) నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.