Ram Kripal Yadav: లాలూ పాత సహచరుడు.. కేంద్ర మంత్రి రామ్ కృపాల్ పై దాడి
కేంద్ర మంత్రి , బిహార్‌లోని పాటలీ పుత్ర నుండి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్‌పై గత రాత్రి దాడి జరిగింది. అంగరక్షకులు తుపాకీ కాల్పులు జరపడంతో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగినప్పుడు యాదవ్ పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు. రామ్ కృపాల్ ఒకప్పుడు RJD వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు సన్నిహితుడైన వ్యక్తి. ఇప్పుడు BJPలో ఉన్నారు . 2014 నుండి పాటలీపుత్ర స్థానాన్ని గెలుపొందారు. ఈసారి,ఆయన లాలూ యాదవ్ కుమార్తె ,రాజ్యసభ MP మీసా భారతితో పోటీ పడుతున్నారు. భారతి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి యాదవ్ చేతిలో ఓడిపోయారు.
మంత్రి మద్దతుదారులు,రోడ్డును దిగ్బంధించి నిరసన
లోక్‌సభ ఎన్నికల ఏడో చివరి దశ పాటలీపుత్ర స్థానానికి నిన్న పోలింగ్ జరిగింది. స్థానిక RJD ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్ నిన్న పోలింగ్ బూత్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె సహాచరులు , గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న యాదవ్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి.. తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. అయితే రామ్ కృపాల్ తప్పించుకోగలిగారు. కానీ అతని మద్దతుదారులు కొందరు గాయపడ్డారు. అనంతరం మంత్రి మద్దతుదారులు,రోడ్డును దిగ్బంధించి నిరసనకు దిగారు. త్వరితగతిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. దీనితో రాకపోకలకు వీలు కల్పించాలని కోరడంతో వారు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.