UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..?
ప్రతి రోజూ వార్తల్లో అనేక హత్యల గురుంచి తెలుసుకుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా భయకరంగా ఉంటాయి. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ లోని బరేలీలో సీరియర్ కిల్లర్ కేసు వైరల్ అవుతోంది. బరేలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో 14 నెలల్లో తొమ్మిది మంది మహిళలు హత్యకు గురయ్యారు. బాధితులంతా ఒకేలా హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. వారందరినీ గొంతుకోసి హత్య చేశారు.
ఒకేలా హత్యలు
ఈ నేరాలు సీరియల్ కిల్లర్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో 25 కిలోమీటర్ల పరిధిలో బాధితులు హత్యకు గురికావడం గమనార్హం. మహిళలంతా 45 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నవారు. మహిళల బట్టలు చిందరవందరంగా ఉన్నాయని, అయితే లైంగిక వేధింపులకు గురికాలేదని TOI నివేదించింది. ఈ కేసులనుఆరు నెలలుగా విచారిస్తున్నారని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
దిల్లీలో సీరియల్ కిల్లర్
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి భారతదేశంలో చాలా మంది సీరియల్ కిల్లర్లు ఉన్నారు. జులై 2015లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఇటీవల రవీందర్ కుమార్ అరెస్టయ్యాడు. దిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఎనిమిదేళ్లలో కనీసం 30 మంది చిన్నారులపై అత్యాచారం చేసి చంపినట్లు రవీందర్ కుమార్ అంగీకరించాడు. "2013లో హత్రాస్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసినట్లు అతను అంగీకరించిన నేరాలలో ఒకటి. ఆ సందర్భంలో, రవీందర్ నేరం చేసిన ప్రదేశాన్ని, తేదీని వివరించాడు