Nilam Shinde: కోమాలో ఉన్న విద్యార్థిని నీలం షిండే తల్లిదండ్రులకు యూఎస్ వీసా మంజూరు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను చూడటానికి ఆమె తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది.
ఈ పరిణామంతో నీలం షిండే తల్లిదండ్రులు అమెరికా వెళ్లనున్నారు.
నీలం షిండే (35) గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో చదువుకుంటోంది.
అయితే, ఈ నెల 14న ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
అప్పటి నుంచి ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. నీలం మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందినవారు.
వివరాలు
పోలీసుల అదుపులో నిందితుడు
తన కుమార్తెను చూసేందుకు నీలం తల్లిదండ్రులు వీసా కోసం ప్రయత్నించారు, కానీ మంజూరు కాలేదు.
ఈ పరిస్థితిని గమనించిన లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే జోక్యం చేసుకుని, తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇక, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ప్రమాదం అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
అయితే, పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగిందని నీలం తండ్రి తనాజీ షిండే తెలిపారు.
అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నామైనా, ఇప్పటి వరకు మంజూరవలేదని ఆయన వాపోయారు.
వివరాలు
నీలం కుటుంబానికి అండగా ఉంటాం: సుప్రియా సూలే
ఈ ఘటనపై ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే స్పందించి,విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సహాయంతో తల్లిదండ్రులకు వీసా ఇప్పించడానికి ప్రయత్నించారు.
కేంద్ర ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
నీలం కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోవడంతో పాటు, తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
దాంతో, ఆమె కోమాలోకి వెళ్లింది. నీలం గత నాలుగేళ్లుగా అమెరికాలో చదువుకుంటూ, ఈ ఏడాదితో తన విద్యను పూర్తి చేసుకోవాల్సి ఉండగా, ఈ ప్రమాదం జరిగింది.