Indian Student: కోమాలో భారతీయ విద్యార్థిని.. కేంద్రం చొరవతో అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అమెరికా ఓకే
ఈ వార్తాకథనం ఏంటి
కోమాలో ఉన్న భారతీయ విద్యార్థినికి సంబంధించి ఆమె కుటుంబం చేసిన విజ్ఞప్తికి అమెరికా నుంచి స్పందన వచ్చింది.
భారత ప్రభుత్వం తీసుకున్న చర్చల ఫలితంగా, యూఎస్ అధికారులు అత్యవసర వీసా ఇంటర్వ్యూకు అనుమతి ఇచ్చారు.
ఈ మేరకు శుక్రవారం ఉదయం 9 గంటలకు వీసా ఇంటర్వ్యూకు స్లాట్ కేటాయించారు.
బాధితురాలి తండ్రి వీసా కోసం చేసిన ప్రయత్నాలు భారత విదేశాంగశాఖ దృష్టికి రావడంతో, అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
దీనిపై అమెరికా సానుకూలంగా స్పందించింది.
వివరాలు
లమ్ షిండే ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు
అత్యవసర ప్రయాణ అనుమతి లేక వీసా మంజూరు చేయాలని భారత విదేశాంగ శాఖకు చెందిన అమెరికా విభాగం అక్కడి ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు సమాచారం.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న నీలమ్ షిండే ఫిబ్రవరి 14న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
కారు ఢీకొనడంతో ఆమె తల, ఛాతికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉంటున్న ఆమె కుటుంబానికి ఈ సమాచారం ఫిబ్రవరి 16న అందింది.
నీలమ్ తండ్రి వెంటనే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ - ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరి దృష్టికి వచ్చింది.
వివరాలు
ఎంపీ సుప్రియా సూలే విజ్ఞప్తి
"నీలమ్ శిందే అనే విద్యార్థిని అమెరికాలో ప్రమాదానికి గురై అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆమె తండ్రి కుమార్తె వద్దకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకే అత్యవసర వీసా కోసం దరఖాస్తు చేశారు. ఆయనకు వెంటనే సహాయం చేయాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నాను" అని ఆమె ఎక్స్ (Twitter) వేదికగా తెలిపారు.