Page Loader
Dehradun: డెహ్రాడూన్‌లో దారుణ ఘటన .. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!  
డెహ్రాడూన్‌లో దారుణ ఘటన .. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!

Dehradun: డెహ్రాడూన్‌లో దారుణ ఘటన .. బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం!  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2024
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణం చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌లోని అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ- డెహ్రాడూన్‌ బస్సులో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సమాచారం ప్రకారం, ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ వెళ్తున్నబస్సులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నివాసి.

వివరాలు 

బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ఆరుగురి అరెస్టు

ఆగస్టు 12న జరిగిన ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలి మానసిక పరిస్థితి బాగాలేదు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. అంతర్గత గాయం ఉందా లేదా అనేది వైద్య పరీక్షల తర్వాతే తెలుస్తుంది. బాలికను వెల్ఫేర్ సెంటర్‌కు తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం, మెడికల్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు ఎస్ఎస్పీ తెలిపారు. అత్యాచారం ఆరోపణలపై బస్సు డ్రైవర్, కండక్టర్ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోనే,ఇటీవల ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వస్తున్న నర్సుపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన విషయం తెలిసిందే.