Page Loader
Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్.. 
వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్..

Varun Gandhi: వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ.. కాంగ్రెస్ ఆఫర్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2024
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పిలిభిత్ ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నవరుణ్ గాంధీని కాదని యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాద్‌కు ఆయన స్థానంలో బీజేపీ అవకాశం కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇప్పుడు వరుణ్ ని తన శిబిరంలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. కాంగ్రెస్ నేత,పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరి వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని అన్నారు. మీడియాతో రంజన్ చౌదరి మాట్లాడుతూ వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరితే సంతోషిస్తానని అన్నారు. వరుణ్ విద్యావంతుడని,గొప్ప నాయకుడని అన్నారు.అతనికి క్లీన్ ఇమేజ్ ఉంది.ఆయన కాంగ్రెస్‌లో చేరాలన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న అధిర్ రంజన్ చౌదరి