Page Loader
దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని
నిజాయతీ గల కొద్దిమంది నేతల్లో చంద్రబాబు ఒకరు

దేశంలోనే అతికొద్దిమంది నిజాయితీ నేతల్లో చంద్రబాబు ఒకరు: ఎంపీ కేశినేని

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 08, 2023
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఎంపీ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలోనే అతికొద్ది మంది నిజాయితీ గల నేతల్లో చంద్రబాబు ఒకరని ఆయన అన్నారు. చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులు ఇవ్వటంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అవినీతి మరకలు లేని నాయకుడు చంద్రబాబు అని ఆయన కీర్తించారు. ఈ మేరకు చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులివ్వటం సాధారణ విషయమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఆయనే సరైన సమాధానం ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నిక్లల్లో తెలుగుదేశం తరుఫున ముచ్చటగా మూడోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

DETAILS

40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలో అవినీతి లేదు : కేశినేని నాని

ఈ క్రమంలోనే మరోసారి గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెడతానన్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం ఓ ప్రైవేట్ స్కూల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ కేశినేని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే పోటీ చేస్తానన్నారు. 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ జీవితంలోనే ఎక్కడ అవినీతి మరకలు లేకుండా ప్రజలకు సేవ చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం ఇప్పటికీ ఆయన నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారని కేశినేని నాని చెప్పుకొచ్చారు.