Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసుల నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఓ పోక్సో కేసులో బాధితురాలి వివరాలను బయట పెట్టడంతో పాటు,అసభ్యంగా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.గోరంట్ల మాధవ్ గతంలో సీఐగా పనిచేశారు,కానీ వివాదాల్లో నిలిచే వ్యక్తిగా పేరొందారు.
అతని న్యూడ్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయినా, తనది కాదని ఆయన ప్రకటించారు.
అయితే, దానిని నిరూపించేందుకు దర్యాప్తు చేయమని మాత్రం కోరలేదు.
వివరాలు
చంద్రబాబు నాయుడును హత్య చేస్తానంటూ హెచ్చరిక
అంతేకాదు, చంద్రబాబు నాయుడును హత్య చేస్తానంటూ గతంలో పలుమార్లు హెచ్చరించిన విషయాలు కూడా ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
అధికారంలో ఉన్న సమయంలో జేసీ బ్రదర్స్‌తో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన మాధవ్, ఇప్పుడు తన తగిన సమయం వచ్చిందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గతంలో పోలీస్ అధికారి గానూ పనిచేసిన గోరంట్ల మాధవ్‌కి ఇప్పుడు పోలీసులు తమ పవర్ చూపించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
మార్చి 5న విజయవాడ సైబర్ క్రైమ్ ఎదుట హాజరైన తర్వాత ఆయన వ్యాఖ్యలు, పోలీసులు తీసుకునే నిర్ణయాలే ఇకపై జరిగే పరిణామాలకు ఆధారంగా నిలవనున్నాయి.