LOADING...
VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా 
బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా

VivekVenkataswamy: బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. కమలం పార్టీకి వివేక్ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Nov 01, 2023
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. మహబూబ్‌నగర్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌తో వివేక్ భేటీ అయ్యేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వివేక్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో వివేక్‌ను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఖర్గే ఆహ్వానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వివేక్ భావిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీజేపీని వీడిన వివేక్