Page Loader
Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి 
హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి

Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2024
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు.బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగ్గా, మృతులు ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు. మృతులు ఒడిశాకు చెందిన తిరుపతి, శంకర్, రాజు, ఖుషి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ యాదవ్, గీతా, నాలుగేళ్ల చిన్నారి హిమాన్షుగా గుర్తించారు. నిర్మాణంలో ఉన్న రిటన్నింగ్ వాల్ అక్కడ పని చేస్తున్నవారిపై పడడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Details 

భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం 

బుధవారం ఉదయం డిగ్గింగ్ మిషన్ సహాయంతో శిథిలాల నుంచి వారి మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలో పలు చోట్ల నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విపత్తు సహాయ దళం (DRF) బృందాలు రోడ్లపై పడిపోయిన చెట్లను తొలగిస్తున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. విష‌యం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ద్రిగ్భాంతి వ్య‌క్తం చేశారు.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.