Page Loader
MLC Kavitha: బనకచర్ల నుంచి నీళ్లు దోచుకుంటున్నారు.. కవిత హెచ్చరిక!
బనకచర్ల నుంచి నీళ్లు దోచుకుంటున్నారు.. కవిత హెచ్చరిక!

MLC Kavitha: బనకచర్ల నుంచి నీళ్లు దోచుకుంటున్నారు.. కవిత హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖమ్మం జిల్లా వైరాలో BRS నేత మదన్ లాల్ నివాసంలో నిర్వహించిన సభలో BRS ఎంపీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మదన్ లాల్ ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటుగా అభివర్ణించిన ఆమె, రెండు నెలల క్రితం జరిగిన మరొక కుటుంబ విషాదాన్ని స్మరించుకుంటూ, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైరా నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

Details

కాంగ్రెస్‌పై కవిత తీవ్ర విమర్శలు 

కాంగ్రెస్‌ పార్టీ తీరును తీవ్రంగా విమర్శించిన కవిత, వానలు పడుతుండటాన్ని ఆసరాగా తీసుకుని రైతులకు సాయం చేస్తామంటూ ఎన్నికల యుద్ధ భేరి మోగించేందుకు సిద్ధమవుతుందని పేర్కొన్నారు. బోనస్ ఇస్తామన్న వారు చివరకు బోగస్ చేసారంటూ వ్యాఖ్యానించారు. రైతులను నిజంగా ప్రేమిస్తే, 42 శాతం BC రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. జూలై 17న రైలు రోకో ఉద్యమానికి పిలుపు BCల హక్కుల కోసం ఉద్యమాన్ని వేడెక్కించనున్నట్లు ప్రకటించిన కవిత, జూలై 17న రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకో నిర్వహిస్తామని తెలిపారు. ఏక్ ఆర్ దక్క-BC బిల్లు పక్కా అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ ఆందోళనకు ఆర్.కృష్ణయ్య, CPI(ML) తదితర పార్టీల మద్దతును కోరుతున్నామని చెప్పారు.

Details

వైరా BRS కార్యకర్తలపై అక్రమ కేసులు: మండిపడ్డ కవిత 

వైరాలో BRS కార్యకర్తలపై కావాలని కేసులు పెట్టిన అధికారులను ఆమె తప్పుబట్టారు. ముగ్గురు మంత్రులు అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని సూచించారు. బనకచర్ల నుంచి గోదావరి నీటిని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించిన ఆమె, అమాయకులపై కేసులు పెట్టడాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.

Details

కేంద్రంపై మండిపడ్డ కవిత 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పలు గ్రామాలను రాష్ట్రం నుంచి తొలగించిన విధానాన్ని ప్రస్తావించిన కవిత, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కు విరుద్ధమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ప్రధాని మాతో స్నేహం ఉన్నట్లు చెబుతున్నారంటున్నారు. అయితే తెలంగాణ గ్రామాలను తిరిగి తీసుకురావడంలో మాకు మద్దతిస్తే, మేము కూడా మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఉద్యమాల పుట్టినిలయమని చెప్పిన కవిత, వైరాలో ప్రారంభమైన ఉద్యమమే రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తుచేశారు. రైలు రోకో కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.