
#NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సహజీవనం వంటి జీవనశైలులు భారతదేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో యువత శారీరక పరిపక్వతకు రాగానే సంబంధాలలోకి ప్రవేశిస్తున్నారు.
వివాహం చేసుకుంటాననే హామీతో లైంగిక సంబంధాలు కొనసాగించడంలో కొంతమంది యువకులు కనిపిస్తున్నారు.
చివరికి వారు నిజంగా వివాహం చేసుకుంటే సమస్యం లేదు, కానీ అది జరగకపోతే మోసపోయామంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
ఇలాంటి సందర్భాల్లో ఇది చట్టానికి వ్యతిరేకమైన చర్యగా పరిగణించబడుతుంది.
తప్పు చేసిన వారికి శిక్ష విధించే అవకాశం ఉంటుంది. భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం వివాహ వాగ్దానంతో మోసపూరితంగా శారీరక సంబంధాలు కలిగి ఉంటే ఎంత శిక్ష పడుతుంది? దీనిపై చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాలు
అబద్ధపు వాగ్దానంతో లైంగిక సంబంధాలు
ఒక యువకుడుఎవరైనా యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటున్నారు.
కానీ ఆ తర్వాత అతను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించడం ప్రేమించి మోసపోయిన బాధితురాళ్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడం తరచుగా జరుగుతున్నాయి
వివాహం పేరుతో మాట ఇచ్చి, శారీరక అవసరాలు తీర్చుకుని, తరువాత పెళ్లిని నిరాకరించడం భారతీయ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది.
భారత న్యాయ విధానం లోని సెక్షన్ 69 ప్రకారం, ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది.
అయితే, పరస్పర సమ్మతితో శారీరక సంబంధం ఏర్పడిన తరువాత, దాన్ని అత్యాచారంగా చిత్రీకరించడం సరికాదని, అలా చేసినపుడు దొంగ కేసులు పెట్టొద్దని కొందరు న్యాయస్థానాలు మహిళలకు సూచించిన తీర్పులు ఇచ్చిన సందర్భాలున్నాయి.
వివరాలు
భారతీయ న్యాయ వ్యవస్థలో శిక్ష వివరాలు - BNS సెక్షన్ 69
భారత న్యాయ వ్యవస్థ 2023 ప్రకారం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 ప్రకారం, ఒక యువకుడు యువతితో వివాహ వాగ్దానం చేసి శారీరక సంబంధం ఏర్పరచుకుంటే, మోసం చేసినట్లు నేరం రుజువైతే, అతడికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
అదనంగా, కోర్టు తరఫున జరిమానా కూడా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ రెండు శిక్షలు కూడా కలిపి విధించే అవకాశముంటుంది.
వివరాలు
మోసపూరిత ఆశలు చూపి శారీరక సంబంధాలు
సెక్షన్ 69 కేవలం వివాహ వాగ్దానంతో సంబంధం కలిగిన కేసులకే పరిమితం కాదు. ఒక వ్యక్తి ఉద్యోగం, సహాయం, లేదా భవిష్యత్తులో ఏదైనా ఆశ చూపిస్తూ ఒక యువతిని నమ్మించి శారీరక సంబంధం కలిగి ఉంటే, మోసపూరితంగా శారీరక అవసరాలు తీర్చుకున్నట్లయితే - నేరం రుజువైతే కోర్టులు శిక్ష విధిస్తాయి.
అంతేగాక, యువతిని గర్భవతిని చేసి, తరువాత పెళ్లికి నిరాకరించినట్లయితే కూడా అదే సెక్షన్ ప్రకారం శిక్ష విధించబడుతుంది.
వివరాలు
సహజీవనం, నైతికత, న్యాయవ్యవస్థ - న్యాయమూర్తుల అభిప్రాయాలు
ఈ మధ్య కాలంలో సహజీవనం జీవనశైలి విస్తృతంగా పెరిగింది. యువత తమకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవిస్తూ, తరువాత మోసపోయామంటూ పోలీసులను, కోర్టులను ఆశ్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇటువంటి కేసుల్లో కొన్ని కోర్టులు సమగ్ర విచారణ నిర్వహించిన తర్వాత సంచలన తీర్పులు ఇచ్చాయి.
పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం ఏర్పడినప్పుడు, దాన్ని మోసం అన్నారు ఎలా అంటారు? అంటూ కొందరు న్యాయమూర్తులు విచారణ సమయంలో ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి.
ఇదే విధంగా వివాహేతర సంబంధాల విషయంలో భార్యభర్తలు ఒకరిపై ఒకరు శిక్ష విధించాలంటూ కోర్టులను ఆశ్రయించిన సందర్భాల్లో - ఇది నైతికంగా తప్పు కావచ్చేమో కానీ, చట్టపరంగా నేరంగా పరిగణించలేమని కోర్టులు తీర్పులు ఇచ్చాయి.