Page Loader
Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి 
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి

Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లోప్రముఖ మావోయిస్టు నేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. పోలీసుల ప్రకారం,వారిలో బసవరాజు కూడా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆయనపై రూ.1.5 కోట్లు రివార్డు ఉందని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్‌ షా చేసిన ట్వీట్ 

వివరాలు 

గణపతి తరువాత మావోయిస్టు నేతగా కేశవరావు 

ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల కేశవరావు, మావోయిస్టు వర్గాల్లో బసవరాజు పేరిట ప్రసిద్ధి పొందారు. ఆయన మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు చీఫ్‌గా ఉన్నారు. 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి పార్టీ ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత, కేశవరావు పార్టీ సుప్రీం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు.

వివరాలు 

ఆదివాసీ గ్రామం నుంచి ఉద్యమ మార్గంలోకి 

కేశవరావు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలానికి చెందిన జియ్యన్నపేట గ్రామ వాసి. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పని చేశారు. కుటుంబంలో ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెల్లు ఉన్నారు. కేశవరావు తన ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేశారు. హైస్కూల్ చదువు తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో చేశాడు. ఆపై టెక్కలి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివి, డిగ్రీ రెండో సంవత్సరం సమయంలో వరంగల్‌లోని రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు వచ్చిందని, ఆయన అక్కడ చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. అక్కడినుంచి ఆయన ఉద్యమ మార్గాన్ని అనుసరించారు. చిన్నప్పటి నుంచీ ప్రజాసేవపై ఆసక్తి ఉండేదని, తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత చెప్పినప్పటికీ ఉద్యమ మార్గాన్నే పట్టుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.