LOADING...
Supreme Court: 'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు': పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు
'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు'

Supreme Court: 'ఎన్‌సిఆర్ మాత్రమే ఎందుకు': పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాలుష్యాన్ని (Pollution) నియంత్రించడంలో విధానాలు కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై ఉండకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరువయిన నేపథ్యంలో, బాణసంచాల విక్రయాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తాజాగా విచారణ జరిగింది. ''దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉన్నప్పుడు, అదే హక్కు మిగతా ప్రాంతాల్లోని ప్రజలకు ఎందుకు ఉండకూడదు..? పాలసీ ఏదైనా దేశవ్యాప్తంగా (పాన్‌ఇండియా లెవెల్) రూపొందించాల్సిందే. ప్రముఖులు, ప్రత్యేక వ్యక్తులు ఉన్నారని కారణంగా దిల్లీకి మాత్రమే ప్రత్యేక విధానాలు రూపొందించడం తగినది కాదు'' అని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాలసీ ఏదైనా పాన్‌ఇండియా లెవెల్‌లోనే ఉండాలి: సుప్రీంకోర్టు