
Supreme Court: తమిళనాడు గవర్నర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఈ చర్య చట్ట విరుద్ధం అంటూ ధర్మాసనం వ్యాఖ్య
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవికి సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది.
ఆయన పదిహేను పైగా బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయడం మీద అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ చర్యను చట్ట విరుద్ధమైనదిగా పేర్కొంటూ ధర్మాసనం గవర్నర్‌ను తీవ్రంగా మందలించింది.
జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా నిలిపివేసిన రోజునుంచి అవి ఆమోదించబడినట్లుగా పరిగణించాల్సిందిగా స్పష్టంగా తెలిపింది.
ఈ పరిణామం స్టాలిన్ ప్రభుత్వం విజయాన్ని అందుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఎం.కె. స్టాలిన్ ప్రభుత్వం తీసుకువచ్చిన పది ముఖ్యమైన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
వివరాలు
గవర్నర్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీం
దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు విచారణలో గవర్నర్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది.
ఆయన తీరు ఏకపక్షంగా ఉన్నదనీ, చట్టానికి విరుద్ధమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను నిలదీసే తీరు కోర్టు తీర్పులో కనిపించింది.
గవర్నర్,రాష్ట్రపతికి పంపిన నివేదికలో పది బిల్లులను రిజర్వ్ చేయాలని సూచించారు.
అయితే ఈ కీలకమైన బిల్లులు ఆమోదం పొందకపోవడం స్టాలిన్ ప్రభుత్వ పరిపాలనలో ఆటంకంగా మారింది.
దీంతో ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లగా,సుప్రీం కోర్టు సంచలనాత్మకంగా తుది తీర్పు వెలువరించింది.
గవర్నర్ ఆపేసిన తేదీ నుంచే బిల్లులు ఆమోదించబడ్డట్లుగా పరిగణించాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది, తద్వారా గవర్నర్ చర్యలకు చట్టపరంగా ఆమోదం లేదని స్పష్టం చేసింది.