Page Loader
Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 
దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ

Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2024
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది. ఆమె దేశ రాజధాని దిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌లను కలిసేందుకు ప్రయత్నించారు. వారు కలవకపోవడంతో..ఇండియా గేట్ వద్ద బొటన వేలు కోసుకుంది. జగన్ హయాంలో ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో వేలు కోసుకున్నట్లు తెలిపింది. బాధితురాలు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

Details 

వీడియోలోని వివరాల ప్రకారం 

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కోపూరు లక్ష్మి ఆదర్శ మహిళా మండల అధ్యక్షురాలు. పత్తిపాడు నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వం అరాచకాలకు తెరలేపిందని ఆమె ఆరోపించింది. మహిళలు గంజాయి అమ్మేలా చేయడం, తప్పుడు పత్రాలతో ఆస్తులు, భూములు అమ్ముకోవడం వంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయని ఆమె వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులు, కత్తులు, రాడ్లతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయని, వీటన్నింటినీ రాష్ట్రం,దేశం,ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీకి వచ్చానన్నారు. రాష్ట్రపతి,సీజేఐ,ప్రధానిని కలవడం కుదరకపోవడంతో వారి కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసి, వేలు కోసుకుని నిరసన తెలుపుతున్నట్లు ఆమె తెలిపారు. తాను చేసిన పనికి అందరూ క్షమించాలని కోపూరు లక్ష్మి వీడియోలో కోరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..