Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని చందాపురలోని హెడ్‌మాస్టర్ లేఔట్ లో సోమవారం ఉదయం ఒక మహిళ దారుణ హత్యకు గురైంది.
అత్యంత కుళ్లిన స్థితితో ఉన్నయువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TOI నివేదిక ప్రకారం,పోలీసులు గది నుండి డ్రగ్స్, సిరంజిని స్వాధీనం చేసుకున్నారు.హత్యకు ముందు యువతిపై లైంగిక దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ భవనం సంగీత్ గుప్తా అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు చెందినది.గత డిసెంబర్‌లో ఒడిశాకు చెందిన సఫాన్ కుమార్ (40) ఆ ఇంట్లో ఉండేవాడని పోలీసులు గుర్తించారు.
సఫాన్‌తో కలిసి అద్దె ఇంట్లో ఓ యువతి(28)ఉండేదని అనుమానిస్తున్నారు.మృతదేహం పక్కన మద్యం సీసాలు,సిగరేట్లు,భోజనం పార్సెల్స్ ఉండడంతో హత్యకు ముందు వారిద్దరూ మద్యం తాగారని అర్ధమవుతోంది.
Details
నిందితుల కోసం గాలింపు చర్యలు
ఐదు రోజుల నుంచి ఇంటి తలుపులు తీయకపోవడంతో ఆ ఇంటి నుండి దుర్వాసన వస్తోంది. దింతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు తలుపులు పగలకొట్టి.. లోపలకు వెళ్లగా యావతి నగ్న మృతదేహం కనిపించింది.
పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
బెంగళూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ బాల్దండి మాట్లాడుతూ.. గదిలో నుంచి సింథటిక్ డ్రగ్‌గా అనుమానిస్తున్న తెల్లటి పౌడర్ లాంటి పదార్థం, సిరంజీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సఫాన్ నుండి ఎలాంటి గుర్తింపు పత్రాన్ని సేకరించలేదని ఇంటి ఓనర్ అంగీకరించాడు. సఫాన్‌తో పాటు అతడికి తెలిసిన వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని పోలీసులు తెలిపారు.