జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ మేరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన నేతలపై మహిళా పోలీస్ చేయి చేసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన కార్యావర్గం యత్నించింది. ఈ మేరకు దిష్టిబొమ్మ దహనానికి మహిళా సీఐ అంజు యాదవ్ అనుమతించబోమని స్పష్టం చేశారు.
గతంలోనూ అంజు యాదవ్ తీరుపై పలు వివాదాలు
అయినప్పటికీ జనసేన కేడర్ దిష్టిబొమ్మ దహనానికే ముందుకు కదలడంతో పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం (హోజ్ అరెస్ట్) చేశారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు పోలీసుల కంటపడకుండా కూడలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలపై సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. సదరు నేత రెండు చెంపలపైనా చెల్లుమనిపించారు. సదరు మహిళా సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ సందర్భంగా సీఐ దురుసు ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలోనూ అంజు యాదవ్ తీరు వివాదాస్పదమైంది. ఓ మహిళపైనా చేయి చేసుకున్నారు. ఈ మేరకు రాజకీయాల్లో మహిళ సీఐ దుష్ప్రవర్తన చర్నీయాంశమైంది.