Page Loader
Amaravati:  అమరావతికి  ప్రపంచ బ్యాంకు బృందం.. కీలక అంశాలపై చర్చ 
అమరావతికి ప్రపంచ బ్యాంకు బృందం

Amaravati:  అమరావతికి  ప్రపంచ బ్యాంకు బృందం.. కీలక అంశాలపై చర్చ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2024
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టడంతో ఇప్పటివరకు పెండింగ్‌ పనులన్నీ త్వరగతిన సాగుతున్నాయి. అమరావతిలో పెట్టుబడి పెట్టటానికి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో టచ్‌లో ఉన్న ప్రతినిధులు ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘుకేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలివియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ ఉన్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలి రాజాక్ ఎఫ్ ఖలీల్‌లతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది.

వివరాలు 

సమావేశంలో పురపాలక శాఖ మంత్రి,సిఆర్‌డిఎ కమిషనర్

ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ కె భాస్కర్ కూడా పాల్గొన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. అంతకుముందు సిఆర్‌డిఎ కార్యాలయంలో సిఆర్‌డిఎ అధికారులతో సమావేశమైన ప్రతినిధి బృందం అమరావతి అభివృద్ధిపై చర్చించింది. అనంతరం అమరావతి రాజధాని ప్రాంతాన్ని సందర్శించి ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో కొండవీటి వాగు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పంప్‌హౌస్‌తోపాటు అమరావతి రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం సమగ్ర అధ్యయనం చేసి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, వీఐటీ యూనివర్సిటీలను సందర్శించింది.