Page Loader
Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయ్యిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె పూర్తిగా స్పష్టమైన మనసుతోనే పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంభాషణలు జరిపిందని హరియాణా పోలీసులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఆమె ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు బయటపడలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా, భారత సాయుధ దళాల గురించి ఆమెకు పెద్దగా సమాచారం లేదని హిస్సార్‌ జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) తెలిపారు.

వివరాలు 

జ్యోతి చర్చలు జరిపిన వారిలో పాక్‌కు చెందిన గూఢచారి సంస్థ సభ్యులు

హిస్సార్‌ ఎస్పీ ప్రకటనలో, ''ఉగ్రవాద ముఠాలగానీ, వ్యక్తులగానీ ఆమెకు సంబంధాలున్నట్లు ఏ ఒక్క ఆధారమూ మాకు లభించలేదు. ఆమె ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు నిరూపించే ఆధారాలు ఇప్పటివరకు లేవు. అంతేకాదు, ఆమె పాక్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల్ని వివాహం చేసుకోవాలనుకున్నదీ, మతం మారాలని భావించినదీ అనే విషయంలో కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వగలిగే పత్రాలు లేదా ఆధారాలు లభించలేదు. అయితే, ఆమె చర్చలు జరిపిన వారిలో పాక్‌కు చెందిన గూఢచారి సంస్థ సభ్యులు ఉన్నట్టు తెలిసినప్పటికీ.. జ్యోతి వారితో సంబంధాలు కొనసాగించిందన్న సంగతి స్పష్టంగా ఉంది. ఇక భారత సాయుధ దళాల ప్రణాళికలపై ఆమెకు స్పష్టమైన అవగాహన ఉందని అనిపించడం లేదు'' అని వివరించారు.