LOADING...
YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్
NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్

YS Jagan: NCLTలో వైఎస్ జగన్ కు భారీ ఊరట.. 'సరస్వతి' షేర్ల బదిలీపై తాత్కాలిక బ్రేక్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (NCLT) వద్ద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం ఉపశమనం లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్‌టి విచారణకు స్వీకరించింది. అలాగే,సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందిన షేర్ల బదిలీని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో,తల్లి వైఎస్‌ విజయమ్మ,చెల్లెలు వైఎస్‌ షర్మిల తమ అనుమతి లేకుండానే, సరస్వతీ పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌లోని షేర్లను అక్రమంగా తమ పేర్లకు బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో విజయమ్మ, షర్మిలతో పాటు సండూర్‌ పవర్‌ లిమిటెడ్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు.

వివరాలు 

ఈ నెల 15వ తేదీకి తీర్పును రిజర్వ్‌

ఇప్పటికే వాదనలు పూర్తి కాగా, ఎన్సీఎల్‌టి ఈ నెల 15వ తేదీకి తీర్పును రిజర్వ్‌ చేసింది. తదుపరి, ఈ రోజు ఇచ్చిన ఉత్తర్వుల్లో సరస్వతీ పవర్ షేర్ల బదిలీని నిలిపివేస్తున్నట్టు స్పష్టంచేసింది. మొత్తంగా, సరస్వతీ పవర్‌ అండ్ ఇండస్ట్రీస్‌ షేర్ల బదిలీ ప్రక్రియ చట్ట విరుద్ధమని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. ఈ బదిలీ చర్య సక్రమమైన పద్ధతిలో జరగలేదని తేల్చి చెప్పింది. షేర్లను అక్రమంగా తమ పేర్లకు బదిలీ చేసుకున్న వారిపై ట్రైబ్యునల్ కఠినంగా స్పందించింది. ఇకపోతే, ప్రస్తుతం సీబీఐ, ఈడీ దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ తరహా షేర్ల బదిలీలు అనుమతించలేమని ట్రైబ్యునల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

వివరాలు 

గత సంవత్సరం సెప్టెంబరులో పిటిషన్‌ను దాఖలు చేసిన జగన్ 

వైఎస్‌ జగన్‌ గత సంవత్సరం సెప్టెంబరులో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన పేరుతో పాటు భార్య వైఎస్‌ భారతీ పేర్లపై ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పైగా,తమ సంతకాలు లేకుండానే ఈ బదిలీలు జరిగాయని ఆరోపించారు.కంపెనీ చట్టం సెక్షన్‌ 59 కింద దాఖలైన ఈ పిటిషన్‌లో ఆయన ప్రతివాదులుగా విజయమ్మ, షర్మిల, జనార్దన్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, దక్షిణాది ప్రాంత రిజినల్ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌ తదితరులను చేర్చారు. షేర్ల బదిలీని తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.సుమారు 10 నెలలుగా వాదనలు సాగిన అనంతరం, ట్రైబ్యునల్ ఈరోజు షేర్ల బదిలీపై తాత్కాలిక ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.