Page Loader
సోనియా,రాహుల్ తో వైఎస్ షర్మిల కీలక భేటీ.. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల
కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల

సోనియా,రాహుల్ తో వైఎస్ షర్మిల కీలక భేటీ.. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్న షర్మిల

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 31, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగనున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీలతో షర్మిల భేటీ అయ్యారు. తమ మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగినట్లు షర్మిల వెల్లడించారు.తెలంగాణ ప్రజల బాగు కోసం వైఎస్సార్ బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే విషయాన్ని మరోసాారి ప్రస్తావించారు. దిల్లీ నుంచి ఇవాళ హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్నట్లు చెప్పారు. మరోవైపు దిల్లీలో మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు షర్మిల సమాధానం దాటవేశారు. ఈ క్రమంలోనే తర్వాత మాట్లాడదామని,తనను వెళ్లనివ్వండని కోరుతూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

EMBED

దిల్లీలో వైఎసాఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

In a major political development, #YSRTP chief #YSSharmila met #SoniaGandhi and #RahulGandhi over breakfast in Delhi and discussed the merger of her party into #Congress. Sharmila is the daughter of Late CM #YSR and the sister of #AndhraPradesh CM #YSJagan.#TelanganaElection2023 pic.twitter.com/Ca1VSypoFD— Ashish (@KP_Aashish) August 31, 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోనియా,రాహుల్ ను కలిసిన వైఎస్ షర్మిల