
Almonds in winters : శీతాకాలంలో బాదం తింటున్నారా.. ఇవి మీకోసమేే
ఈ వార్తాకథనం ఏంటి
బాదం పప్పు అంటే ఎవరికైనా ఇష్టమే. దీనివల్ల శరీరంలోకి ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి.
అయితే చాలా మంది తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆహారంగా ఉదయాన్నే నానెబట్టిన బాదం గింజల్ని తినడం అలవాటు.
నాలుగైదు బాదం గింజలు తింటే పర్వాలేదు. కానీ ఎక్కువగా తింటే మాత్రం శీతాకాలంలో ఆరోగ్యపరమైన సమస్యలుంటాయని వైద్య నిపుణులు అంటున్నారు.
మలబద్ధకం :
బాదం గింజల్లో పీచు పదార్థం, పొటాషియం ఎక్కువ. నాలుగైదు గింజలే తినడం ఉత్తమం.
బాదం, పేగుల కదలనికను ప్రోత్సహించి మల విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి.
అంతకంటే ఎక్కువగా తింటే మాత్రం అజీర్ణం, మలబద్ధకం, పొట్ట ఉబ్బరం సహా గ్యాస్ సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణలు పేర్కొన్నారు.
DETAILS
ఎక్కువగా తింటే పొట్టలో కూతలు, జీర్ణ సంబంధిత సమస్యలుంటాయి
పోషకాల శోషణలో లోపం :
బాదం ఎక్కువగా తీసుకోవడంతో పీచు పదార్థాలు అదనంగా మన శరీరంలోకి వస్తాయి. దీంతో పాటు సైటిక్ యాసిడ్‌ని కలిగి ఉంటుంది.
ఫలితంగా మన శరీరం కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి ఖనిజాలను సక్రమంగా శోషించుకోలేదు. అయితే బాదంలో క్యాలరీలూ ఎక్కువగా ఉంటాయి.
ఇదే సమయంలో శీతాకాలంలో సాధారణంగా మనుషుల జీవక్రియ నెమ్మదిస్తూ ఉంటుంది కనుక ఎక్కువ క్యాలరీలను తీసుకుంటే బరువు పెరగొచ్చు.
విటమిన్ ఈ : బాదం అధికంగా తింటే విటమిన్ ఈ ఎక్కువగా మన శరీరంలోకి చేరుతుంది. ఎక్కువగా తింటే పొట్టలో కూతలు, జీర్ణ సంబంధిత సమస్యలుంటాయి.
DETAILS
బాదంలో పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది
బాదం ఎక్కువగా తింటే నాలుక, నోరు, పెదాలు, గొంతు లాంటివి ఒరుసుకుపోయినట్లు అవుతాయి.
బోన్ హెల్త్'కు మంచిది కాదు : బాదంలో ఎక్కువ మొత్తంలో పాస్ఫరస్ ఉంటుంది. ఇది కాల్షియంతో కలిసి ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
పాస్ఫరస్ ఎక్కువగా లోపలికి వెళ్తే రెండింటి మధ్య బ్యాలెన్స్ లేక ఎముకలు బలహీనమవుతాయి.
కిడ్నీల్లో రాళ్లు :
వీటిలో ఆక్సలేట్లు ఉంటాయి. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు ఇవే కారణమవుతాయి.
ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ రాళ్ల రోగులు వీటినిి తింటే ఇబ్బందులు ఉంటాయి.
వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లతో సంతులితంగా ఉండాలి. లేకుంటే వాపులు ఏర్పడి అవి గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి.