
Bathukamma : బతుకమ్మ విశిష్టత.. ఎలా, ఎన్ని రోజులు జరుపుకుంటారో తెలుసా ?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బతుకమ్మ అంటేనే ఓ ప్రత్యేకమైన పండగ. ఆడపడుచులందరు ఒక్కచోటకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ పార్వతి దేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.
ఆశ్వయుజ శుద్ధ అమావాస్యనాడు బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది. దీన్ని 9రోజుల పాటు జరుపుకుంటారు. అయితే చివరిరోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు.
ఆరోజు దూర ప్రాంతాల్లోని అక్కా చెల్లెళ్లు, వదినా మరదళ్లు, చిన్నారులు, బంధువులు అంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు. అనంతరం దగ్గర్లోని నీటిలో నిమజ్జనం చేస్తారు.ఇందులో భాగంగానే మక్క సత్తును ప్రసాదంగా అందరికీ పంచిపెడతారు.
ప్రకృతి సౌందర్యమైన పువ్వులనే అమ్మవారిగా కొలుస్తూ బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరోవైపు బతుకమ్మపై ఉంచిన గౌరమ్మను మహిళలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటారు.
details
9రోజులు తొమ్మిది రకాలుగా..
ఏటా వర్షాకాలం ముగింపులో, శీతాకాలం ప్రారంభంలో బతుకమ్మ పండుగ వస్తుంది. ఇదే సమయంలో చెరువులన్నీ నీటితో కళకళలాడుతుంటాయి.
గునుగు, తంగేడు లాంటి రంగుల పువ్వులు విరబూసి ఉంటాయి. నందివర్ధనం పువ్వులకూ ఇదే అనుకూల కాలం.
తొమ్మిది రోజుల పాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు రోజుకో తీరుగా కొలుస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) ఎంగిలి పూల బతుకమ్మ
2) అటుకుల బతుకమ్మ
3) ముద్దపప్పు బతుకమ్మ
4) నానే బియ్యం బతుకమ్మ
5) అట్ల బతుకమ్మ
6) అలిగిన బతుకమ్మ
ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యమేమీ సమర్పించరు.
7) వేపకాయల బతుకమ్మ.
8) వెన్నముద్దల బతుకమ్మ
9) సద్దుల బతుకమ్మ- ఈరోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.