
శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో మార్పులు రావడానికి కారణమయ్యే అలవాట్లు ఏంటో చూద్దాం
ఈ వార్తాకథనం ఏంటి
హార్మోన్లు అనేవి రసాయనిక సమాచారాలను శరీర భాగాలకు అందజేస్తాయి. హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినా, లేకపోతే కావాల్సిన దానికంటే తక్కువ ఉత్పత్తి అయినా శరీరంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
మూడ్ సరిగ్గా ఉండకపోవడం, అధిక అలసట, బరువు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం లేదా పెరగడం, యాంగ్జాయిటీ, నిద్ర లేకపోవడం మొదలైన లక్షణాలు హార్మోన్ల అసమతుల్యత కారణంగా వస్తాయి.
ప్రస్తుతం హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
భోజనం చేయకపోవడం
ఒక రోజులో ఒక మనిషికి ఎంత ఆహారం కావాలో అంత ఖచ్చితంగా తినాలి. కావాల్సినంత ఆహారం తినకపోతే హార్మోన్ల లోపం ఏర్పడి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో మార్పు వస్తుంది.
Details
అధిక వ్యాయామం అనర్థానికి దారితీస్తుంది
అధిక కెఫైన్
కొద్దిపాటి కెఫైన్ మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది, కాకపోతే మీరు అధికంగా కెఫైన్ తీసుకోవడం మొదలుపెడితే హార్మోన్ల సమస్య ఏర్పడి మెదడులో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మీకు ఒత్తిడి అధికమవుతుంది.
అతిగా వ్యాయామం
శరీరానికి వ్యాయామం చాలా మేలు చేస్తుంది. కానీ మీరు అతిగా వ్యాయామం చేస్తున్నట్లయితే మీ శరీరానికి హాని కలిగిస్తున్నట్లే లెక్క. అధిక వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి శరీరానికి అనేక ఇబ్బందులు కలుగుతాయి.
నిద్ర లేకపోవడం
మీరు సరిగ్గా నిద్ర పోకపోతే స్టెస్ హార్మోన్ కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. అలాగే రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. కాబట్టి సరైన జీవన విధానాన్ని అవలంబించాలి.