
బరువు తగ్గించే గ్రీన్ టీని ఎలా తయారు చేసుకోవాలి, ఏ సమయాల్లో తాగితే ఉత్తమం!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రీన్ టీ.. ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. ఇందులో ఉండే ఈజీసీజీ పదార్థం జీవక్రియ రేటు పెంచుతుంది.
గ్రీన్ టీలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంపొదిస్తాయి.
శరీరంలో ఏర్పడే కొవ్వులను తొలగించి, అధిక బరువు పెరగకుండా రక్షిస్తుంది.
బరువు తగ్గడం కోసం కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీని సేవించడంతో ఉత్త ఫలితాలు సాధించవచ్చు.
బరువు తగ్గేందుకు గ్రీన్ టీని ప్రత్యేకంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
DETAILS
కావాల్సిన పదార్థాలు :
నీరు - 2 కప్పులు
గ్రీన్ టీ బ్యాగ్ - 1
తేనె - 2 నుంచి 3 చెంచాలు
నిమ్మకాయ - రెండు చిన్నవి. లేదా 1 పెద్దది
దాల్చిన చెక్క - ½ అంగుళం
గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి ఒక నిమిషం మరిగించాలి. స్టౌవ్ మంటను తగ్గించి గ్రీన్ టీ పౌడర్ వేసి రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత గ్రీన్ టీని వడగట్టి, గ్లాసులోకి తీసుకోవాలి.
గ్లాస్ లోకి తీసుకున్నాక నిమ్మరసం, 2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడితో పాటు తేనెనూ కలపి గోరు వెచ్చగా సేవించాలి.
DETAILS
గ్రీన్ టీ తయారీలో ఈ మూడు కీలకమే
గ్రీన్ టీ - నిమ్మకాయ : నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుందని, ఇది వ్యాయామం చేసేటప్పుడు 30 శాతం కొవ్వును కరిగించేందుకు ఉపకరిస్తుంది.
గ్రీన్ టీ -తేనె : శరీర బరువును నియంత్రించడంలో తేనె చాలా బాగా పని చేస్తుంది.
ఉదయాన్నే రోజూ గోరువెచ్చని నీటిలో 3 చెంచాల తేనె కలిపి తాగితే త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. తేనెను గ్రీన్ టీతో కలిపి తాగితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు.
గ్రీన్ టీ-దాల్చిన చెక్క : కొవ్వును తగ్గించడంలో దాల్చిన చెక్క సైతం కీలక పాత్రనే పోషిస్తోంది. తక్కువ కేలరీలు తినడం, ఖచ్చితమైన వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
DETAILS
ఏ సమయాల్లో గ్రీన్ టీ తాగాలంటే
ఇంట్లోనే తయారు చేసుకున్న గ్రీన్ టీని ఉదయం లేవగానే ఓసారి, సాయంత్రం సమయంలో మరోసారి తీసుకోవాలి. ఇది శరీరంలో పేరుకున్న కొవ్వులను కరిగిస్తుంది.
ఉదయం వ్యాయామం చేసే అరగంట ముందు ఈ గ్రీన్ టీని తాగితే వ్యాయామ సమయంలో ఇది ఇంధనంగా పని చేస్తుంది. శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించేస్తుంది.
బరువు తగ్గాలంటే గ్రీన్ టీ నాణ్యమైన కంపెనీ పౌడర్ వాడాల్సిందే. పొడి మంచి క్వాలిటీ ఉంటేనే కోరుకున్న ఫలితాలు వస్తాయి.
మరో చిట్కా ఏంటంటే గ్రీన్ టీ బ్యాగ్ ఉపయోగించుకున్న అనంతరం వాటిని పడేయకుండా, దానితో ఫేస్‌ప్యాక్‌ను సైతం తయారు చేసుకోవచ్చు
DETAILS
గ్రీన్ టీ వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
మెదడు చురుగ్గా ఉండటానికి సాయం చేస్తుంది.
క్యాన్సర్ ని నిరోధిస్తుంది.
కీళ్లనొప్పులను తగ్గిస్తుంది
ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తపోటును నియంత్రించడంలోనూ గ్రీన్ టీది పెద్ద పాత్రే.
రోగనిరోదక శక్తిని పెంచి, క్రిముల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
కాలేయ రక్షణకూ గ్రీన్ టీ ఔషధంలాగా పనిచేస్తుంది. శరీరంలోని పలు విష పదార్దాలను గ్రీన్ టీ తొలగించి కాలేయాన్ని రక్షిస్తుంది.