
ఆవలింతలు అదుపు లేకుండా రావడానికి గల కారణాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎక్కువగా అలసిపోతే లేదా బోర్ గా ఫీలయితే ఆవలింతలు రావడం జరుగుతుంటుంది. ఐతే ఆవలింతలు అధికంగా అదుపు లేకుండా వస్తూ ఉంటే అది అనారోగ్యానికి కారణం కావచ్చు.
ప్రస్తుతం అధిక ఆవలింతలకు, అనారోగ్యానికి సంబంధమేంటో ఇక్కడ తెలుసుకుందాం.
నిద్ర లేకపోవడం:
శరీరానికి కావాల్సినంత నిద్రలేకపోతే ఆవలింతలు అధికంగా వస్తాయి. నిద్రలేకపోవడం అనేది అలసటకు దారి తీస్తుంది. దానివల్ల ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. స్లీప్ డిజార్డర్లయిన నార్కోలెప్సీ, ఇన్సోమ్నియా, పారాసోమ్నియా, స్లీప్ ఆప్నియా కారణంగా ఆవలింతలు వస్తాయి.
మందుల ప్రభావం:
యాంగ్జాయిటీ, డిప్రెషన్ ను దూరం చేసే మెడిసిన్స్ కారణంగా కూడా ఒక్కోసారి ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఇవే కాకుండా ఇతర మెడిసిన్స్ కూడా ఆవలింతలు అధికంగా రావడానికి కారణంగా ఉంటున్నాయి.
ఆరోగ్యం
ఆవలింతలను అధికం చేసే అనారోగ్య కారణాలు
నాడీ సమస్యలు:
మూర్ఛ పోవడం, మైగ్రేన్ కారణంగా కూడా ఆవలింతలు వస్తాయి. అంతేకాదు ఏదైనా విషయం గురించి ఎక్కువగా బాధపడుతుంటే ఆవలింతలు అధికంగా వస్తాయి.
కాఫీ, నికోటిన్ వదిలేసినపుడు:
సిగరెట్, కాఫీ మానేసినపుడు ఆవలింతలు వస్తాయి. ఇవి మొదట్లో ఎక్కువగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోతాయి.
గుండె సమస్యలు:
ఆవలింతలు ఎక్కువగా రావడానికి గుండె సమస్యలు కూడా కారణంగా నిలుస్తున్నాయి. గుండె దగ్గర రక్తం కారిపోవడం వల్ల ఇలా వస్తుంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా పెరిగిన శరీర వేడిని, మెదడు వేడిన తగ్గించడానికి ఆవలింతలు అధికంగా వస్తుంటాయి.
ఆవలింతలు ఎక్కువగా వస్తున్న టైమ్ లో తల తిప్పడం, వికారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి.