Mosquito : ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు!
శీతా కాలం (Winter) అంటేనే వ్యాధుల కాలమని చెప్పొచ్చు. ఇక శీతకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండటంతో విష జ్వరాలు ప్రబిలే అవకాశం ఉంటుంది. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దోమల(Mosquito) పట్ల అలసత్వం వహిస్తే మాత్రం ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదముంది. దోమల నిరవాణకు మార్కెట్లో దొరికే వివిధ రసాయాలను వాడుతుంటాం. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. సహజ సిద్ధంగా దోమల్ని తరిమి కొట్టడానికి మనం ఇంట్లో కొన్ని మొక్కలను నాటితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
రోజ్మేరీ మొక్క కాండం వాసనకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి
ఏడాది పొడవునా బంతి మొక్కలు పూస్తూనే ఉంటాయి. బంతి పూల వాసనకు దోమలు రావు. ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ బంతి పూల మొక్కను ఉంచితే దోమల్ని తరిమికొడుతుంది. ఈ మొక్కలు పైరేత్రమ్, సపోనిన్ అనే సమ్మేళనాలు రిలీజ్ అవుతాయి. రోజ్మేరీ మొక్క పూల వాసన దోమలకు నచ్చవు. ఈ మొక్క కాండం వాసనకు దోమలు దూరంగా వెళ్లిపోతాయి. ఈ మొక్క నుంచి నూనె తీసి కూడా అమ్ముకోవచ్చు. దీన్ని శరీరంపై రాసుకున్న కూడా దోమలు కుట్టవు.
తులసి ఆకుల రాసాన్ని స్ప్రే చేస్తే దోమలు రావు
లావెండర్ మొక్క ఆయిల్ ని వివిధ అనారోగ్య సమస్యల్ని నివారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు, చీమలు, ఈగలు, సాలె పురుగులు దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఈ మొక్క చర్మ సమస్యల్ని కూడా నివారించగలదు. తులసి మొక్క ఉన్న చోట దోమలు రాకుండా చూస్తుంది. తులసి ఆకుల రసాన్ని ఒంటికి రాసినా, ఇంట్లో స్ప్రే చేసినా కూడా దోమలు రాకుండా ఉంటాయి.