Page Loader
Kerala- IRCTC: అందాల కేరళను దర్శించాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి తెలుసుకోండి..
Kerala- IRCTC: అందాల కేరళను దర్శించాలనుకుంటున్నారా..?

Kerala- IRCTC: అందాల కేరళను దర్శించాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి తెలుసుకోండి..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ నుంచి కేరళకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది. భారత రైల్వే టూరిజం అండ్ కార్పొరేషన్ (IRCTC) ఈ ప్యాకేజీని నిర్వహిస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా అలెప్పీ, మున్నార్‌ వంటి ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు కేరళకు ప్రత్యేకత తీసుకొచ్చే పచ్చటి ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు. IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://www.irctctourism.com వెళితే, 'KERALA HILLS & WATERS' అనే పేరుతో ఈ ప్యాకేజీ వివరాలు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఏప్రిల్ 22వ తేదీకి అందుబాటులో ఉంది.

వివరాలు 

టూర్ ప్యాకేజీ ధరలు ఇలా..

ఈ ట్రిప్‌ మొత్తం 5 రాత్రులు, 6 రోజులు పాటు సాగుతుంది. ప్రయాణం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. కంఫర్ట్ 3ఏ క్లాస్ లో: సింగిల్ షేరింగ్‌ — ₹35,180 డబుల్ షేరింగ్‌ — ₹20,260 ట్రిపుల్ షేరింగ్‌ — ₹17,450 స్టాండర్డ్ క్లాస్ లో: సింగిల్ షేరింగ్‌ — ₹32,450 డబుల్ షేరింగ్‌ — ₹17,530 ట్రిపుల్ షేరింగ్‌ — ₹14,720 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు గల చిన్నారుల కోసం కూడా ప్రత్యేక టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే లేదా బుకింగ్ చేయాలంటే, IRCTC టూరిజం వెబ్‌సైట్ అయిన https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.