
దక్షిణ భారతదేశంలో నవరాత్రులు, దసరా ఉత్సవాలు ఎలా జరుపుకుంటారంటే..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని హిందూ ప్రముఖ పండుగల్లో దేవి శరన్నవరాత్రులు, దసరా పెద్ద పండుగలు. ఈ వేడుకలను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేరుతో జరుపుకుంటున్నారు.
తూర్పు భారతంలో దుర్గాపూజ
ఉత్తర, పడమర దేశంలో - గర్బా దాండియా రాస్
దక్షిణ భారతదేశంలో - దేవీనవరాత్రులు
దుర్గా దేవిని వివిధ రూపాల్లో కొలుస్తూ ప్రత్యేకంగా పార్వతిదేవి అమ్మవారికి పూజలు చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తుంటారు.
ఈ తొమ్మిది రోజులూ ఉపవాసాలు పాటిస్తూ, ప్రత్యేకమైన, సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరిస్తారు.
తమిళనాడులో గోలు బొమ్మలు
నవరాత్రులలో మొదటి మూడు రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి మూడు రోజులు దుర్గాదేవికి, చివరి మూడు రోజులు సరస్వతికి పూజలు చేస్తారు. గోలు బొమ్మలు, పౌరాణిక పాత్రలు, జంతువులు, వ్యక్తుల మీద చిత్రీకరిస్తారు.
details
తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో..
తెలంగాణలో భద్రాద్రి రామాలయం ఉపాలయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఐదు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. 1973లో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అయితే 2023 నాటికి అర్దశతాబ్ధం పూర్తైంది.
మరోవైపు ఏపీలోని విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ేనిర్వహిస్తుంటారు.
తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మంది బెజవాడ కనకదుర్గమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.
details
కేరళ, మైసూర్ లోనూ ఘనంగా దసరా, నవరాత్రులు
కేరళ, పూజావైప్పు
కేరళలో నవరాత్రుల చివరి మూడు రోజులకు ప్రాముఖ్యత ఉంది. మహాష్టమి సాయంత్రం పూజావిప్పు నిర్వహిస్తారు. మరుసటి రోజున సరస్వతీ దేవిని ఆరాధిస్తారు.
ఆ తల్లికి పుస్తకాలను, వాయిద్యాలను సమర్పించి మొక్కుకుంటారు. చివరి రోజు విద్యారంభం, పూజ ఎడుప్పులో ఈ వస్తువులను తీసేసి, 2 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు ఇసుక లేదా బియ్యంపై అక్షరాలు రాయిస్తారు.
మైసూర్ దసరా
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే నవరాత్రులు, మైసూర్ దసరా ఉత్సవాలతో సమానంగా ఉంటాయి.
చాముండి కొండలోని దేవత చాముండేశ్వరికి అంకితమైంది.దసరా సమయంలో మైసూర్ ప్యాలెస్ "జంబూ సవారీ" ఊరేగింపు సందర్భంగా పెద్ద లైట్లు, పూలతో అలంకరిస్తారు. వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఆత్మీయుల ఇళ్లను సందర్శించడం ఆనవాయితీ.