
Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల మధ్యలో మున్నార్ అనే ప్రముఖ పర్వత ప్రాంతం విస్తరించి ఉంది.
ఈ ప్రాంతం దక్షిణ భారతదేశంలో అత్యంత చల్లని వాతావరణాన్ని కలిగి ఉండటం వల్ల, ముఖ్యంగా శీతాకాలంలో టూరిస్టులు విపరీతంగా ఇక్కడికి తరలివస్తారు.
మున్నార్ చుట్టూ ఉన్న అనేక అందమైన,అన్వేషించదగ్గ ప్రదేశాలు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయి. ఇప్పుడు వాటిలో ముఖ్యమైన ప్రాంతాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం:
వివరాలు
1. మున్నార్ టాప్ స్టేషన్
ముద్రపుజ, నల్లతన్ని, కుండల్ పర్వతాల మధ్యలో ఉన్న ఈ టాప్ స్టేషన్, మున్నార్ పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా సందర్శించబడే ప్రాంతాల్లో ఒకటి.
ఇది మున్నార్ నుండి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు సరిహద్దుకు సమీపంగా ఉంటుంది.
ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి కనిపించే పశ్చిమ కనుమల దృశ్యాలు పర్యాటకులను ఉల్లాసభరితుల్ని చేస్తాయి.
ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉండే నీలకురింజి పువ్వులు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పుష్పించడమే కాకుండా, టాప్ స్టేషన్ పరిసరాల్లో కురింజిమల అభయారణ్యం, టాటా టీ మ్యూజియం వంటి ప్రదేశాలు కూడా చూడదగినవే.
వివరాలు
2. కుండల సరస్సు
టాప్ స్టేషన్ వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సరస్సు, సముద్ర మట్టానికి 1700 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
చెర్రీ పూవులు రెండేళ్లకు ఒకసారి వికసించే ఈ ప్రాంతం, నీలకురింజి పుష్పాలకూ ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ అద్భుతంగా నిర్మించిన వంపు ఆకారంలోని ఆనకట్ట ఒక ప్రత్యేక ఆకర్షణ.
పర్యాటకులు ఇక్కడ బోటింగ్‌ను ఆస్వాదించవచ్చు. పెడల్, రో, స్పీడ్ బోట్లలో ప్రయాణించే సౌకర్యం ఉంది.
రైడ్ కోసం చార్జీలు సాధారణంగా ₹300-₹500 మధ్యగా ఉంటాయి. సమీపంలోని గోల్ఫ్ కోర్స్, టాటా టీ తోటలు కూడా చూడదగినవి.
వివరాలు
3. మట్టుపెట్టి డ్యామ్
మున్నార్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో, అనముడి పర్వత శ్రేణుల మధ్య ఉన్న ఈ డ్యామ్ ప్రకృతి ప్రేమికులకు ఆదర్శంగా ఉంటుంది.
ఇక్కడ నీటి పొరల్లో టీ తోటల ప్రతిబింబం చూడగానే మంత్రముగ్ధులవుతారు. బోటింగ్‌తోపాటు ట్రెక్కింగ్‌కు ఇష్టపడే వారు షోలా అడవుల వైపుగా వెళ్లవచ్చు.
ప్రవేశ రుసుము ₹10. స్పీడ్ బోటింగ్‌కు ₹500, సాధారణ బోటింగ్‌కు ₹300 చెల్లించాలి. సాయంత్రం పూట సందర్శిస్తే మరింత విశేషం.
వివరాలు
4. ఎరవికులం నేషనల్ పార్క్
కేరళలోని మొట్టమొదటి నేషనల్ వైల్డ్ లైఫ్ పార్క్ ఇది. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ పార్క్ నీలగిరి థార్ అనే అరుదైన జాతి మూగజీవాలకు నిలయంగా ఉంది.
ఇవే కాకుండా పక్షులు, సీతాకోక చిలుకలు వంటి అనేక వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తాయి.
ఫిబ్రవరి-ఏప్రిల్‌లో రెండు నెలలు పార్క్ మూసివేస్తారు. మిగిలిన రోజుల్లో ఉదయం 7.30 నుంచి సాయంత్రం 3.30 వరకు సందర్శించవచ్చు. ప్రవేశ రుసుము ₹190.
వివరాలు
5. రోజ్ గార్డెన్
వివిధ రకాల పూలతో అలరించే ఈ గార్డెన్ పర్యాటకులను ప్రశాంతంగా గడపడానికి ఆహ్వానిస్తుంది.
ఇక్కడ గంటల పాటు గడిపినా అలసట ఉండదు. కొన్ని పూల విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ గార్డెన్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసుము ₹30. ఇక్కడ పూల మధ్య టీ లేదా కాఫీ తాగడం ప్రత్యేక అనుభూతి.
6. ఎకో పాయింట్
ఇక్కడ మాట్లాడే మాటలు ప్రతిధ్వనిగా తిరిగి వినిపించడమే ఈ ప్రదేశానికి ప్రత్యేకత.
చల్లని వాతావరణం, పచ్చని పర్వతాలు, లోయలు, నదులు, టీ తోటలు కలిసి ప్రకృతి అందాలను వెలికి తెస్తాయి.
ఫోటోగ్రాఫర్లకు, ప్రేమికుల జంటలకు, ట్రెక్కింగ్ అభిమానులకు ఇది ఉత్తమ గమ్యస్థానం.
వివరాలు
7. అనముడి శిఖరం
ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం (9000 అడుగుల ఎత్తు).
దీనిని "దక్షిణ హిమాలయాలు" అని కూడా పిలుస్తారు. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.
మార్గమధ్యలో పర్యాటకులు నదులు, జలపాతాలు, అరుదైన జంతువులు, పక్షులను వీక్షించవచ్చు.
పార్క్ యాజమాన్యం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి. బృందంగా వెళ్లడం ఉత్తమం.
8. కొలుక్కుమలై టీ ఎస్టేట్
ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న తేయాకు తోటలుగా ఈ ప్రదేశం గుర్తింపు పొందింది.మున్నార్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది దాదాపు 100 ఏళ్లనాటి చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ తీయబడే టీకి ప్రత్యేక రుచి ఉంటుంది. ఫోటోగ్రాఫర్లు ఇక్కడి అందాలను చూసి ఆలస్యం కూడా మర్చిపోతారు.
వివరాలు
9. అట్టుకడ్ జలపాతాలు
అడవుల మధ్య నల్లని రాళ్లపై తెల్లని నీరు జలదరలు జలపాతంలా ప్రవహించడం చూసి మనసు మురిసిపోతుంది. ఈ ప్రాంతం పక్షులకు మంచి వాసస్థలం. జలపాతం పక్కన టీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
10. లక్కొం జలపాతాలు
మున్నార్‌కి 25కిలోమీటర్ల దూరంలో ఉడుమలైపెట్టై మార్గంలో ఉన్న ఈ జలపాతాలు, ఎరవికులం పార్కులో భాగం.పంబన్ నదికి మూలమైన ఈ ప్రదేశం పర్యాటకులకు ఈత కొట్టేందుకు, ఫోటోలు తీయటానికి అనుకూలంగా ఉంటుంది.
ఇలా మున్నార్ చుట్టూ ఉన్న ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను కలిగి ఉండటం వల్ల ఇది భారతదేశంలోని అత్యంత ఆదరణ పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక్కడి పర్వతాలు, జలపాతాలు, నదులు, పుష్పాలు, అడవులు... అన్నీ కలిసి పర్యాటకులకు ఒక స్మరణీయమైన అనుభూతిని అందిస్తాయి.
వివరాలు
మున్నార్‌లో ఎక్కడ తినాలి:
1. ప్రాంతీయ వంటకాలు:
రాప్సీ రెస్టారెంట్.. కేరళ భోజనాన్ని అందించడానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వెళ్ళినప్పుడు కేరళ పరోటా, మటన్ ఫ్రై కాంబోను మిస్ అవ్వకండి. మున్నార్‌లోని శరవణ భవన్ స్వచ్ఛమైన వెజ్ దక్షిణ భారత థాలీలను అందిస్తుంది.
2. Cosy Cafes :
టీ టేల్స్ కేఫ్ ఇది యూరోపియన్ వైబ్‌ను కలిగి ఉంది. వారు మసాలా చాయ్ నుండి హెర్బల్ బ్లెండ్‌ల వరకు,మీకు ఆకలిగా ఉంటే వాఫ్ఫల్స్ , శాండ్‌విచ్‌ల వరకు ప్రతిదీ అందిస్తారు. మధ్యాహ్న విరామానికి సరైనది.
ప్లాంటర్స్ కేఫ్ టీ కౌంటీ రిసార్ట్ మైదానంలో ఉంది కానీ బయటి వ్యక్తులకు తెరిచి ఉంటుంది. కాఫీ సూపర్ గా ఉంటుంది.
వివరాలు
చక్కటి భోజనానికి హార్న్‌బిల్ రెస్టారెంట్
3. ఫైన్-డైనింగ్ రెస్టారెంట్లు:
విండర్‌మేర్ ఎస్టేట్‌లోని హార్న్‌బిల్ రెస్టారెంట్ చక్కటి భోజనాన్ని అందిస్తుంది. కేరళ రుచులను ఎక్కువగా ఇష్టపడేవారికి సరైన ఛాయస్.
పెప్పర్ చికెన్, అప్పం ప్రత్యేకం. క్లబ్ మహీంద్రా బార్బెక్యూ బే గ్రిల్డ్ మీట్స్, సీఫుడ్, స్మోకీ వెజిటేరియన్ ఇక్కడ స్పెషల్.