NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / World Fisheries Day 2023 : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం అంటే ఏమిటో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    World Fisheries Day 2023 : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం అంటే ఏమిటో తెలుసా
    World Fisheries Day 2023 : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం ఎందుకో తెలుసా

    World Fisheries Day 2023 : అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం అంటే ఏమిటో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 21, 2023
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చేపల వృత్తి సంరక్షణకు, మత్స్య సంపదను పెంపొందించేందుకు ఏటా నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారే దినోత్సవం జరుపుకుంటారు.

    సముద్ర పర్యావరణ వ్యవస్థల రక్షణ,ప్రపంచవ్యాప్తంగా మత్స్య సంపదపై ఆధారపడిన కోట్లాది మంది గంగపుత్రుల జీవనోపాధికి ఊతం ఇచ్చేందుకు మత్స్యకారులు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

    ఇదే సమయంలో చేపల పెంపకం ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచి, స్థిరమైన ఫిషింగ్ పద్ధతుల అమలు కోసం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

    1997లో వరల్డ్ ఫోరమ్ ఆఫ్ ఫిష్ హార్వెస్టర్స్ అండ్ ఫిష్ వర్కర్స్ దిల్లీలో సమావేశమైంది.ఈ క్రమంలోనే వరల్డ్ ఫిషరీస్ ఫోరమ్ స్థాపించారు.

    సదస్సులో భాగంగా 18 దేశాల ప్రతినిధులు స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు, విధానాలను ప్రపంచవ్యాప్తంగా స్వీకరించడం కోసం సంయుక్త ప్రకటనపై సంతకాలు సైతం చేశారు.

    details

    ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది ఫిషర్ మెన్లు ఉన్నారో తెలుసాే

    1997లో నిర్వహించిన ప్రపంచ మత్స్య సదస్సులో పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా హాజరైన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏటా నవంబర్ 21ని ప్రపంచ మత్య్స దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునివ్వగా, ప్రపంచదేశాలన్నీ ఆమోదించాయి.

    ప్రపంచం జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్య్స సంపది ఒకటి. ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రధాన ఆహార వనరుగా నిలిచింది.

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 కోట్ల మెట్రిక్‌ టన్నుల చేపలను ఆహారంగా వినియోగిస్తున్నారు.

    చేపల వేటపై ఆధారపడి జీనాధారం సాగిస్తున్న వారి సంఖ్య 40 నుంచి 45 కోట్లకుపైనే ఉంది. అంతర్జాతీయంగా ఏటా 9- 10 వేల కోట్ల డాలర్ల విలవువైన చేపల ఎగుమతి జరుగుతోంది.

    DETAILS

    మత్స్యరంగంలోని సవాళ్లు ఇవే : 

    చేపల పెంపకం, ఆవాసాల క్షీణత, అక్రమంగా చేపలు పట్టడం, కాలుష్యం, వాతావరణ మార్పుల ప్రభావం వంటి సవాళ్లు మత్స్యకారులను ఇబ్బంది పెడుతున్నాయి.

    అయితే ఆయా సమస్యలపై ఏటా అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా దృష్టిపెట్టనున్నారు.

    జల జీవావరణ వ్యవస్థలను సంరక్షించడం, మత్స్య సంపదపై ఆధారపడిన వారి జీవనోపాధిని కాపాడటం, స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు సహా సముద్ర వనరుల బాధ్యతాయుత నిర్వహణ అవసరాన్ని నవంబర్ 21 గుర్తు చేస్తుంది.

    గంగపుత్రుల శ్రేయస్సు, సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, ఫిషరీస్ నిపుణులు ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుంటారు.

    DETAILS

    నీలి విప్లవంలో భారతదేశం ముందంజ

    భారతదేశంలో నీలి విప్లవం ద్వారా మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడం, ఆర్థికంగా మరో విప్లవం తీసుకురావడంలో భారత ప్రభుత్వం ముందంజలోనే ఉంది.

    చేపల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంపొందించడం, నాణ్యతను మెరుగుపరచడం, వ్యర్థాలను తగ్గించడం ద్వారా మత్స్య రైతుల ఆదాయాన్ని పెంచేలా లక్ష్యం పెట్టుకుంది.

    2020 మేలో ఐదేళ్ల కాలానికి రూ.20,050 కోట్లకుపైగా బడ్జెట్‌తో "ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    2024-25 నాటికి ప్రస్తుత 15 నుంచి 22 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తిని సాధించి,మత్స్య రంగం ద్వారా సుమారుగా 55 లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలను కల్పించడం పిఎంఎంఎస్‌వై లక్ష్యంగా పెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025