LOADING...
Donald Trump: స్నేహితుడంటూనే డ్రగ్స్‌ జాబితాలోకి భారత్‌ను చేర్చిన ట్రంప్‌
స్నేహితుడంటూనే డ్రగ్స్‌ జాబితాలోకి భారత్‌ను చేర్చిన ట్రంప్‌

Donald Trump: స్నేహితుడంటూనే డ్రగ్స్‌ జాబితాలోకి భారత్‌ను చేర్చిన ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
08:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో పాటు మొత్తం 23 దేశాలు అక్రమంగా మత్తు పదార్థాలు (డ్రగ్స్‌) తయారు చేసి, వాటిని రవాణా చేసే కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల పేర్లూ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దేశాలు అక్రమ డ్రగ్స్‌ తయారీతో పాటు, వాటి తయారీలో వాడే రసాయనాలను కూడా సరఫరా చేస్తున్నందున అమెరికా పౌరుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్నాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను ఆయన సోమవారం అమెరికన్‌ కాంగ్రెస్‌కు సమర్పించిన 'ప్రెసిడెన్షియల్‌ డిటర్మినేషన్‌' అనే నివేదికలో పేర్కొన్నారు.

వివరాలు 

ఈ దేశాలు ప్రధానంగా డ్రగ్స్‌ను ఉత్పత్తితోపాటు రవాణా

భారత్, పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్, ద బహమాస్, బెలీజ్, బొలీవియా, బర్మా, కొలంబియా, కోస్టారికా, ద డొమినికన్‌ రిపబ్లిక్, ఈక్వెడార్, ఎల్‌ సాల్వడార్, గ్వాటెమాలా, హైతీ, హోండురస్, జమైకా, లావోస్, మెక్సికో, నికరాగువ, పనామా, పెరూ, వెనెజువెలా దేశాలు ప్రధానంగా డ్రగ్స్‌ను ఉత్పత్తి చేయడంతోపాటు రవాణా చేస్తున్నాయని వివరించారు.