40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మూన్ మిషన్ లాంచింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఎన్నో కీలక ఘట్టాలను దాటుకుంటూ వెళ్తోంది. ఈ మేరకు మిషన్ చివరి దశకు వచ్చేసింది.
40 రోజుల చంద్రయాన్-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ పీఐబీ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది.
శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి జులై 14న నిప్పులు చిమ్ముకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 ఆగస్ట్ 23 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ జరగనుంది.
ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు కోట్లాది మంది భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.మరికొద్ది గంటల్లోనే ఇస్రోకు చెందిన వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పీఐబీ విడుదల చేసిన ట్వీట్
Chandrayaan-3 Mission🚀
— PIB India (@PIB_India) August 21, 2023
Witness the cosmic climax as #Chandrayaan3 is set to land on the moon on 23 August 2023, around 18:04 IST.@isro pic.twitter.com/ho0wHQj3kw