Cancer: క్యాన్సర్‌ను అంతమందించే నోటి బ్యాక్టీరియా
తల, మెడ వచ్చే క్యాన్సర్ కణతులను నోటీలో ఉండే మంచి బ్యాక్టీరియా అంతమందిస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. లండన్‌లోని పరిశోధకులు ఒక సాధారణ రకమైన నోటి బాక్టీరియా అయిన ఫ్యూసోబాక్టీరియం కొన్ని క్యాన్సర్‌లను చంపగలదని కనుగొన్నారు. పరిశోధనలో తల, మెడ వద్ద క్యాన్సర్ ఉన్న రోగులకు మెరుగైన ఫలితాలను ఓ అధ్యయనం వెల్లడించింది. ఫ్యూసోబ్యాక్టీరియం అనేది 99శాతం క్యాన్సర్ కణాల్ని చంపుతుందని, క్యాన్సర్ చికిత్సలో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు.
155 మంది రోగులను పరీక్షించిన శాస్త్రవేత్తలు
155 మంది రోగులను డేటాను పరిశీలించి, వివిధ పరిశోధనలు జరిపారు. నోట్లో ఫూసోబ్యాక్టీరియా ఉన్న రోగుల్లో క్యాన్సర్ 65శాతం వరకు తగ్గింది. ఇక ప్రయోగశాలలో క్యాన్సర్ కణాలపై బ్యాక్టరీయాను పరీక్షించగా, క్యాన్సర్ కణాల్లో 70 నుంచి 99శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఇండియాలో తల, మెడ క్యాన్సర్ల పేషెంట్లు 26శాతం వరకు ఉన్నాయి.