
Japanese astronaut: అంతరిక్షంలో సోలో బేస్ బాల్ ఆడిన జపాన్ వ్యోమగామి.. స్పందించిన ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌కు చెందిన వ్యోమగామి కోయిచి వకట అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్నప్పుడు బేస్‌బాల్ ఆడారు.
ప్రముఖ వ్యాపారవేత్త,స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA)కి చెందిన కోయిచి వకట,ఐఎస్‌ఎస్‌లో ఉన్న సమయంలో జీరో గ్రావిటీని వినియోగించి వినూత్నంగా బేస్‌బాల్ ఆడారు.
స్వయంగా బాల్ విసిరి,మళ్లీ తానే షాట్ కొట్టిన వీడియోను ఆయన స్వయంగా పంచుకున్నారు.
"ఇది బేస్‌బాల్ సీజన్...మేజర్ లీగ్ బేస్‌బాల్ సీజన్ జపాన్‌లో ప్రారంభమవుతోంది.ఎక్స్‌పెడిషన్ 68 సమయంలో,ఐఎస్‌ఎస్‌లో బేస్‌బాల్ ఆడాను.జీరోగ్రావిటీలో ఈ ఆట ఆడేందుకు జట్టు అవసరం లేకపోయింది"అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ ఆసక్తికరమైన వీడియోను ఎలాన్ మస్క్ రీపోస్టు చేశారు.
వివరాలు
ఐదుసార్లు ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన కోయిచి వకట
దాదాపు రెండు దశాబ్దాలుగా కోయిచి వకట వ్యోమగామిగా సేవలందించారు. 2024లో JAXA నుంచి రిటైర్ అయ్యారు.
ఐదుసార్లు ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన ఆయన, మొత్తం 500 రోజులు అంతరిక్షంలో గడిపారు.
ఎక్స్‌పెడిషన్ 39 సమయంలో, ఐఎస్‌ఎస్‌లో తొలి జపనీస్ కమాండర్గా నిలిచారు.
ఇక, ఇటీవల ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్, భూమికి విజయవంతంగా తీసుకురావడం గమనార్హం.