
Elon Musk Neuralink: ఎలాన్ మస్క్ న్యూరాలింక్ అద్భుతం.. బ్రెయిన్ సహాయంతో మారియో కార్ట్, చెస్ ఆడుతున్న పక్షవాతానికి గురైన వ్యక్తి
ఈ వార్తాకథనం ఏంటి
2016లో స్విమ్మింగ్ ప్రమాదం కారణంగా భుజం నుండి కిందపక్కల పారాలైజ్ అయిన నోలాండ్ ఆర్భాట్, ఎలాన్ మస్క్ న్యూరాలింక్ చిప్ ద్వారా మళ్లీ కొన్ని పనులు చేయగలుగుతున్నాడు. ఈ చిప్ 2024లో ఆయన మెదడులో సర్జరీ ద్వారా అమర్చారు. చిప్ చిన్న ఎలక్ట్రోడ్ల ద్వారా న్యూరాన్లతో కనెక్ట్ అవుతుంది. దీనివల్ల ఆర్భాట్ ఆలోచనల ద్వారా కంప్యూటర్ కర్సర్ కదిలించగలడు, స్క్రీన్‌లో టైప్ చేయగలడు, ఇతర కనెక్ట్ అయిన డివైసెస్‌ను నియంత్రించగలడు. ఆర్భాట్ ప్రతి రోజు 10 గంటల వరకు చిప్‌ని ఉపయోగిస్తున్నాడు. దీనివల్ల ఆయన మారియో కార్ట్, చెస్ వంటి గేమ్స్ ఆడడమే కాకుండా,హోమ్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ చేయగలడు,చదువుకోగలడు.
వివరాలు
చిప్ తో భవిష్యత్తుపై ఆశ
ప్రస్తుతం ఆయన అరిజోనా కమ్యూనిటీ కాలేజ్‌లో చదువుతున్నాడు.. ఒక వ్యాపారం కూడా మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటి వరకు ప్రయాణం సులభంగా లేదు. ఆపరేషన్ తర్వాత చిప్‌లో కొన్ని సమస్యలు వచ్చాయి, కానీ సరి చేయడంతో ఇప్పుడు చాలా పనులు తిరిగి చేయగలుగుతున్నాడు. సర్జరీకి ముందు ఆయన జీవితం పూర్తిగా నిరాశతో ఉంది. ఇప్పుడు ఈ చిప్ ఆయనకు స్వతంత్రత, ప్రేరణ, భవిష్యత్తుపై ఆశ ఇచ్చింది.