Loading...
OpenAI,Anthropic: ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్‌లో చైనా గూఢచారులు.. మాజీ పరిశోధకుడి సంచలన ఆరోపణలు
ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్‌లో చైనా గూఢచారులు.. మాజీ పరిశోధకుడి సంచలన ఆరోపణలు

OpenAI,Anthropic: ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్‌లో చైనా గూఢచారులు.. మాజీ పరిశోధకుడి సంచలన ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో విదేశీ గూఢచర్యంపై మరోసారి చర్చ మొదలైంది. చైనాకు చెందిన గూఢచారులు అమెరికాకు చెందిన ప్రముఖ AI సంస్థలు ఓపెన్‌ఏఐ (OpenAI), ఆంత్రోపిక్ (Anthropic)లోకి ఇప్పటికే చొరబడి ఉండొచ్చని ఆ సంస్థల్లో గతంలో పనిచేసిన మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఆరోపించారు. ఈ విషయంపై తనకు 90 శాతం నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ వ్యాపారవేత్త ప్యాట్రిక్ బెట్-డేవిడ్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో కాక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలు నిజమనే విషయంలో తనకు ఎంతమేర నమ్మకం ఉందని అడిగినప్పుడు.. ''90 శాతం నమ్మకంగా ఉన్నాను'' అని ఆయన సమాధానమిచ్చారు.

వివరాలు 

ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్‌లో పరిశోధకుడిగా పనిచేసిన కాక్సన్

కాక్సన్ గతంలో ఓపెన్‌ఏఐలో, ఆ తర్వాత ఆంథ్రోపిక్‌లో పరిశోధకుడిగా పనిచేశారు.

AI సాంకేతికత అభివృద్ధి చాలా వేగంగా కొనసాగుతున్న తీరు మానవాళి భవిష్యత్తుకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఇటీవల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కారణాలతోనే ఆంథ్రోపిక్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా AI సంస్థల్లో చైనాకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులకు అంతర్గత సమాచారం అందుబాటులోకి వస్తే.. అత్యంత కీలకమైన AI మోడళ్లను రహస్యంగా బయటకు తరలించే అవకాశం ఉంటుందని కాక్సన్ హెచ్చరించారు.

ఈ పరిస్థితి అమెరికా సాధించిన సాంకేతిక ఆధిక్యాన్ని చైనా దెబ్బతీయడానికి అవకాశం కల్పించొచ్చని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

అమెరికా రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులపై కఠినమైన భద్రతా తనిఖీలు

అమెరికా AI రంగంలో విదేశీ గూఢచర్యంపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాలో అభివృద్ధి చేసిన AI మోడళ్లను చైనాకు చెందిన సంస్థలు 'డిస్టిలేషన్' విధానం ద్వారా అనుకరిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ ప్రక్రియలో పెద్ద AI మోడల్‌ను 'టీచర్'గా ఉపయోగించి.. దాని ఆధారంగా చిన్న AI మోడల్‌కు శిక్షణ అందిస్తారు.

ఇదే సమయంలో అమెరికా రక్షణ రంగ సంస్థల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులపై కఠినమైన భద్రతా తనిఖీలు ఉంటాయని కాక్సన్ చెప్పారు.

అయితే సిలికాన్ వ్యాలీలోని AI కంపెనీల్లో ఇలాంటి భద్రతా పరిశీలనలు తక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

AI సంస్థల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియలోనూ రక్షణ రంగంలో అమలు చేసే స్థాయి భద్రతా నిబంధనలను తీసుకురావాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా, చైనా మధ్య AI ఆధిపత్య పోటీ

మరోవైపు అమెరికా, చైనా మధ్య AI ఆధిపత్య పోటీ మరింత తీవ్రంగా మారుతోంది.

నిక్కీ లెక్కల ప్రకారం.. సెప్టెంబరులో చైనాకు చెందిన 10 ప్రముఖ AI సంస్థలు కలిపి 16 మోడళ్లను విడుదల చేశాయి.

అదే సమయంలో అమెరికాలోని ప్రముఖ AI సంస్థలు 10 నుంచి 12 వరకు కొత్త మోడళ్లు, వాటి వేరియంట్లు, ప్రత్యేక రీజనింగ్ మోడళ్లను విడుదల చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT