Blood Moon: ఆకాశంలో మరో అద్భుతం.. ఎరుపు రంగులో చంద్రుడు.. బ్లడ్‌మూన్ ఎఫెక్ట్..! ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఆకాశంలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడటం సహజం. అయితే, కొన్ని సందర్భాల్లో గ్రహణాల సమయంలో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటాయి.
త్వరలోనే మరో అద్భుతమైన దృశ్యం ఆకాశంలో కనబడనుంది.
మార్చి 13, 14 తేదీల్లో సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడనుంది.
ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి అగ్నిగోళంలా కనిపించనున్నాడు. అలా కనిపించడం వల్లే దీనిని "బ్లడ్ మూన్" అని పిలుస్తారు.
వివరాలు
బ్లడ్ మూన్ అంటే ఏమిటి?
చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడినప్పుడు, చంద్రుడు ఎర్రటి వర్ణంలో దర్శనమిస్తే దాన్ని బ్లడ్ మూన్ (Blood Moon) అంటారు.
ఇది సాధారణంగా భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు సంభవిస్తుంది.
భూమి చంద్రుడిని కప్పివేయడం వల్ల సూర్యకాంతి నేరుగా చంద్రుడిని తాకదు.
అయితే, భూమి వాతావరణం ద్వారా వక్రీభవనం చెందిన కాంతి చంద్రుడిపై పడుతుండటంతో, చంద్రుడు ఎర్రటి కాంతిలో మెరుస్తూ కనిపిస్తాడు.
వివరాలు
చంద్రుడు ఎర్రగా ఎందుకు మారతాడు?
చంద్రుడు ఎర్రటి రంగులో కనిపించడానికి భూమి వాతావరణంలో కాంతి వ్యాప్తి (Scattering of Light) ముఖ్య కారణం.
సూర్యుడు చంద్రుడికి నేరుగా కాంతిని ఇవ్వకపోవడంతో, భూమి వాతావరణంలో గాలి, ధూళి రేణువులు సూర్యకాంతిని వ్యాపింపజేస్తాయి.
ఇందులో నీలం, పసుపు వంటి తక్కువ తరంగదైర్ఘ్యం (Short Wavelength) కలిగిన రంగులు శోషించబడతాయి.
అయితే, ఎరుపు రంగు (Red Light) ఎక్కువ తరంగదైర్ఘ్యం (Long Wavelength) కలిగి ఉండటంతో చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది.
ఇది సూర్యాస్తమయం లేదా సూర్యోదయ సమయంలో ఆకాశం ఎర్రగా మారటంతో సమానం.
వివరాలు
బ్లడ్ మూన్ - సమయం, తేదీ
Timeanddate.com ప్రకారం, మార్చి 13-14 మధ్యరాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం అనేక దశల్లో కనబడనుంది.
ఈస్టర్న్ డేలైట్ టైమ్ (ESD) ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 11:57 గంటలకు ప్రారంభమై, 2:26 గంటల నుంచి 3:31 గంటల వరకు చంద్రుడు పూర్తిగా ఎర్రటి వర్ణంలో మెరిసిపోతాడు.
ఉదయం 6:00 గంటలకల్లా గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. భారత కాలమానం (IST) ESD కంటే 10 గంటల 30 నిమిషాలు ముందే ఉంటుంది.
అంటే అక్కడ రాత్రి 12:00 అయినప్పుడు, మన దేశంలో ఉదయం 10:30 అవుతుంది.
వివరాలు
బ్లడ్ మూన్ ఎక్కడ కనిపిస్తుంది?
ఈ బ్లడ్ మూన్ పశ్చిమ అర్ధగోళం (Western Hemisphere) లోని ప్రజలకు సంపూర్ణంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా దేశాల్లోని ప్రజలు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించగలరు.
అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. యూరప్‌లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో గ్రహణం పూర్తయ్యే సమయంలో చంద్రుడు ఉదయించనుంది.
ఈ గ్రహణాన్ని చూడడానికి టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా వీక్షించగలరు. అయితే, లైట్ పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఈ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది.
వివరాలు
ఇది ఎందుకు ప్రత్యేకం?
చంద్రగ్రహణం తరచుగా సంభవించదు. ఈసారి జరుగనున్న సంపూర్ణ చంద్రగ్రహణం 2022 తర్వాత మళ్లీ మొదటిసారి కనిపించనుంది.
అదీగాక, ఈసారి చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారడం ఈ గ్రహణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.
ఈ మార్చిలో కనిపించనున్న బ్లడ్ మూన్ ఒక అద్భుత ఖగోళ సంఘటన.
రాత్రి సమయంలో అర్థగోళాల్లో ఉన్న వారు దీన్ని నిర్బంధంగా వీక్షించవచ్చు.
టెలిస్కోప్ లేకపోయినా, స్వచ్ఛమైన ఆకాశం కింద నేరుగా కనువిందు చేయవచ్చు. ఖగోళశాస్త్ర ప్రేమికులకు ఇది గొప్ప అనుభూతిని అందించే దృశ్యం కానుంది!