అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్
ChatGPTతో ఉన్న కొత్త Bing గురించి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రకటన గురించి ఇంకా అందరు చర్చిస్తుండగానే గూగుల్ తన AI-సెంట్రిక్ "లైవ్ ఫ్రమ్ ప్యారిస్" ఈవెంట్ ను పారిస్‌లో ఏర్పాటు చేసింది. ఇందులో Bard-గూగుల్ గురించి ప్రివ్యూతో పాటు గూగుల్ లెన్స్ గురించి కొన్ని అప్‌డేట్‌లు ఉన్నాయి. మొదటిసారిగా OpenAI అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్ గూగుల్ కు ప్రత్యర్థిగా గట్టి పోటీనివ్వడం మొదలుపెట్టింది. చాలామంది ఇంటర్నెట్ సెర్చ్ లో చాట్‌బాట్‌ను ఉపయోగించడం కొత్త ఆవిష్కరణ అని భావిస్తున్నారు.మైక్రోసాఫ్ట్ OpenAIలో పెట్టుబడి పెట్టి గూగుల్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసింది. BardAI ఈ ఈవెంట్‌లో హైలైట్ అవుతుందని అనుకున్నారు. అయితే BardAI గురించి తెలిసిందే తప్ప కొత్తగా ఏమి చెప్పలేదు.
ఎలక్ట్రిక్ వాహనాలకు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్ గురించి వేగంగా సమాచారాన్నిస్తుంది
గూగుల్ 'multisearch near me'ను కూడా ఉపయోగించి, సమీపంలోని వంటకం లేదా వస్తువు వంటి వాటి కోసం వెతకడంలో సహాయపడుతుంది. ఇది ఇప్పుడు USలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌కి త్వరలో రానున్న మరో ఫీచర్, గూగుల్ లెన్స్‌ని ఉపయోగిస్తున్న స్క్రీన్ నుండి బయటకి రాకుండా టెక్స్ట్‌లు, ఫోటోలతో సెర్చ్ చేసే సామర్థ్యం. ల్యాండ్‌మార్క్‌ల కోసం మాత్రమే అందుబాటులో ఉండే ఇమ్మర్సివ్ వ్యూ ఇప్పుడు లండన్, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోతో సహా ఐదు నగరాలలో అందుబాటులో ఉంది. గూగుల్ మ్యాప్స్ ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్లకు ఛార్జింగ్ స్టేషన్ గురించి సమాచారాన్నిస్తుంది. ఈ ఫీచర్‌లు అంతర్నిర్మిత గూగుల్ మ్యాప్స్‌తో ఎలక్ట్రిక్ వాహనాల కోసం అందుబాటులోకి వస్తాయి.