Blood moon: హోలీ స్పెషల్.. సంపూర్ణ చంద్ర గ్రహణం రానుంది!
ఈ వార్తాకథనం ఏంటి
మార్చి 13-14 తేదీల్లో కన్యారాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత ఇలాంటి సంపూర్ణ చంద్ర గ్రహణం జరగడం ఇదే తొలిసారి.
విశేషంగా 14వ తేదీన హోలీ పౌర్ణమి కూడా ఉండటం ఈ గ్రహణానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చింది.
తెల్లవారు జామున 2:26 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై, 3:31 నిమిషాలకు ముగుస్తుంది.
మొత్తం 65 నిమిషాల పాటు చంద్రుడు భూమి ఛత్ర ఛాయలోకి వెళ్తాడు. దీన్నే సూతక కాలంగా పరిగణిస్తారు.
మార్చి నెలలో ఏర్పడే చంద్ర గ్రహణాన్ని 'బ్లడ్ మూన్' అని కూడా అంటారు.
Details
భారత్‌లో కనిపించదు
ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, పసిఫిక్ తీర దేశాల్లో పూర్తిగా దర్శనమిస్తుంది.
యూరప్, తూర్పు ఆసియా ప్రాంతాల్లో పాక్షికంగా మాత్రమే కనిపిస్తుంది.
అలస్కా, హవాయ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, కెనడా, మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, స్పెయిన్, ఫ్రాన్స్, యూకే, మొరాకో, సెనెగల్ వంటి దేశాల్లో ప్రజలు ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు.
Details
చంద్ర గ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సూర్యుడు-భూమి-చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చేప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడితే సంపూర్ణ చంద్ర గ్రహణం, కొంత భాగం మాత్రమే కప్పుకుంటే పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
ప్రత్యక్షంగా చూడొచ్చు
ఈ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడడం పూర్తి సురక్షితం. ఎలాంటి భద్రతా గ్లాసెస్ అవసరం లేదు. కంటి చూపుపై ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. NASA ఈ గ్రహణాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.